వాహనరంగంలో మొదట పెట్రోల్, డీజిల్ వాహనాలు.ఆ తర్వాత ఎలక్ట్రిక్ వాహనాలు( Electric vehicles ) మార్కెట్ లోకి అడుగు పెట్టాయి.
ఆ తరువాత సోలార్ సిస్టం( Solar system ) తో కూడా నడిచే వాహనాలు వచ్చాయి.ఇప్పుడు ఇంజన్ లేకుండా, ఎక్కువ ఖర్చుతో నడిచే కారు అందరినీ ఆకర్షిస్తుంది.
దాని వివరాలు ఏమిటో చూద్దాం.ప్రస్తుతము పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతూ పోతుండడంతో వాహనదారులు చుక్కలు కనిపిస్తున్నాయి.
వీటికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వచ్చి కాస్త ఊరట కలిగించినప్పటికీ, ఆ వాహనాలలో చార్జింగ్ ప్రధాన సమస్య.ఎలక్ట్రిక్ వాహనాలలో తక్కువ దూరం అయితే పర్వాలేదు కానీ ఎక్కువ దూరం ప్రయాణించాలంటే చార్జింగ్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

మరొకపక్క ఎలక్ట్రిక్ వాహనాలలో బ్యాటరీ సమస్యలు( Battery problems ) ఎక్కువ కావడంతో దూరప్రాంతాలకు వెళ్లాలంటే కష్టమే.వీటిని దృష్టిలో పెట్టుకొని పశ్చిమబెంగాల్ ( West Bengal )కు చెందిన ఒక వ్యాపారవేత్త డీజిల్, పెట్రోల్, చార్జింగ్ లాంటివి ఏమీ లేకుండా కేవలం ఎండ తో నడిచే కారును రూపొందించాడు.పశ్చిమ బెంగాల్ కు చెందిన మనోజిత్ మాండల్ అనే ఒక వ్యక్తి, తన నానో కారులో ఇంజన్ తొలగించి కారు రూఫ్ టాప్ పై సోలార్ పలకలను ఏర్పాటు చేశాడు.ఈ సౌర పలకలు సౌర శక్తిని విద్యుత్ శక్తిగా మార్చి బ్యాటరీకి అందిస్తాయి.

కారు బ్యాటరీ సహాయంతో ప్రయాణిస్తుంది.గంటకు 80 కిలోమీటర్ల దూరంతో, దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించగలదు.ఇందులో ఇంజన్ లేకపోయినా గేర్ సిస్టం ఉంటుంది.కేవలం 50 రూపాయల ఖర్చుతో 100 కిలో మీటర్లు ప్రయాణించవచ్చు.మార్కెట్లో గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతూ పోతున్న క్రమంలో కాస్త విన్నుతం గా ఆలోచించి సోలార్ వాహనాన్ని నిర్మించుకున్నాడు.కేవలం ఎండతో నడిచే కారును రూపొందించడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
అయితే ఈ కారును రూపొందించడంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి చివరికి సక్సెస్ అయ్యాడు.







