ఆ సంస్థల్లో కోట్లలో పెట్టుబడి పెట్టిన నయనతార.. భవిష్యత్తు కోసం అద్భుతమైన ప్లాన్?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార మనందరికీ సుపరిచితమే.ఈమె సినిమా లలో నటించి తన అందం, అభినయంతో టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా ఎంతోమంది ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది.

 Nayanthara Invested In Huge Amount Dubai Based Company, Nayanatara, Vignesh Shiv-TeluguStop.com

నయనతారకు కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.ఇకపోతే నయనతార కొత్త రకం పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారి, టాలీవుడ్ తోపాటు కోలీవుడ్ లో కూడా విభిన్న రకాల సినిమాల్లో నటిస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా నయనతార కొత్త బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది దుబాయ్ కి చెందిన ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఆయిల్ కంపెనీలో దాదాపుగా 100 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే నయనతార తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో మునిగి తేలుతున్న విషయం అందరికి తెలిసిందే.ఈ జంట దుబాయ్ బిజినెస్ పని మీద వెళ్లి అక్కడే నూతన సంవత్సర వేడుకను కూడా జరుపుకున్నారు అని సమాచారం.

నయనతార, విఘ్నేష్ శివన్ కలిసి రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు.ఈ బ్యానర్ పై ఇప్పటికే పలు రకాల సినిమాలను కూడా నిర్మించారు.

అందులో భాగంగానే కూళంగల్ సినిమాను నిర్మించారు.అలాగే ఛాయ్ వాలా అనే చెన్నైకి చెందిన బేవరేజ్ బ్రాండ్ కోసం వీరిద్దరూ కలసి ఇన్వెస్ట్ చేశారు.ఇకపోతే నయనతార ప్రస్తుతం కాతువాక్కుల రెండు కాదల్, కనెక్ట్, గాడ్ ఫాదర్, లయన్ వంటి సినిమాల్లో నటిస్తోంది.ఇటీవల నయనతార చెన్నై లోని పోయెస్ గార్డెన్ లో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది.

చెన్నైలోని విలాసవంతమైన ప్రదేశాలలో పోయెస్ గార్డెన్ కూడా ఒకటి.తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, అలాగే రజనీకాంత్ తదితరులు నివాసాలు కూడా అక్కడే ఉన్నాయి.

ఇక నయనతార విగ్నేష్ శివన్ తో కలిసి ఉండటానికి ఆ ప్లేస్ ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Nayanthara Starts New Business 100Crore Investment

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube