మొదలైన పోలింగ్ ఉత్కంఠకు గురవుతున్న నేతలు!

గత కొన్ని రోజులుగా తారా స్థాయి కి చేరిన ఎన్నికల వేడికి ముగింపు పలికే రోజు వచ్చేసింది.తెలంగాణ వ్యాప్తంగా 2290 మంది అభ్యర్థుల తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

 Leaders Who Are Excited About Polling And So On , Congress, Brs , Bjp, Cpm, Jan-TeluguStop.com

మొత్తం 119 నియోజకవర్గాలకు గాను అధికార బారస 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా, జాతీయ కాంగ్రెస్( Congress ) 118 స్థానాల్లో పోటీ చేస్తూ ఒక స్థానాన్ని సిపిఐ కు కేటాయించింది. బిజెపి ( BJP )111 స్థానాల్లో పోటీ చేస్తూ మిత్ర పక్షం జనసేనకు 8 స్థానాలను కేటాయించింది.19 నియోజకవర్గాల్లో సిపిఎం( CPM ) పోటీ చేస్తుండగా 107 స్థానాలలో బీఎస్పీ అభ్యర్థులు పోటీపడుతున్నారు.14 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఐదుగురు ఎమ్మెల్సీలు తో సహా మొత్తం 2290 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ఇన్ని రోజులు తమ గెలుపు కోసం అన్ని రకాల అస్త్రాలనూ ఉపయోగించిన నాయకులు చివరి నిమిషంలో అందరూ ఊహించినట్లే ధన ప్రవాహాన్ని యేరులై పారించారు .

Telugu Congress, Janasena, Revanth Reddy-Telugu Top Posts

అనేక చోట్ల తనిఖీలలో కోట్ల కొద్దీ డబ్బు పట్టు పడుతూ ఉండటం ఈసారి ఎన్నికల్లో డబ్బు ఏ స్థాయిలో ప్రభావం చూపించబోతుందో అర్థమవుతుంది.అన్ని పార్టీల అభ్యర్థులూ డబ్బులు పంచుతూ ఉండటంతో ఇప్పుడు గెలుపుపై ఏ ఒక్కరికి పూర్తిస్థాయి నమ్ముకం లేని పరిస్థితిని అభ్యర్థులు ఎదుర్కొంటూ ఉండడం తో ఉత్కంఠ క్షణక్షణానికి పెరిగిపోతుంది.ఆదివారం పలితాల రోజు వరకూ ఇదే స్థాయి ఉత్కంఠ కొనసాగే అవకాశం కనిపిస్తుంది.

ఆదివారం విజేతలు ఎవరో ప తెలిసిపోతుంది.ఈ సారి ఓటింగ్ శాతం పెరుగుదలపై ఎన్నికల కమిషన్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది.

Telugu Congress, Janasena, Revanth Reddy-Telugu Top Posts

అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలకు కార్యాలయాలకు సెలవు ప్రకటించడంతో ఓటింగ్ పెరుగుతుంది అని ఆశిస్తున్నారు .అయితే ఎప్పటిలాగానే పట్టణ ఓటర్ బద్దకిస్తారా లేక మారుతున్న పరిస్థితులు నడుమ ఓటు వేయడానికి నడుం కడతారా అన్నది చూడాలి.ముఖ్యంగా పల్లె ప్రాంతాలలో ఆత్యదికస్తాయిలో ఓటింగ్ నమోదు అవుతుంటే పట్టణ ప్రాంతాల్లో సుమారు 50% మాత్రమే నమోదు అవుతుంది.ఈసారి ఓటింగ్ శాతం పెరిగేలా అన్ని అన్ని రాజకీయ పార్టీలతో పాటు స్వచ్చంద సంస్థలు కూడా భారీ ఎత్తున ప్రచారం చేస్తాయి.

మరి గత రెండు నెలలుగా ఎడ తెగని ప్రయత్నాలు చేసిన అభ్యర్థుల తలరాతలు మరో రెండు రోజుల్లో ఒక కొలిక్కి వస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube