బిడెన్ భావోద్వేగ ప్రసంగం...!!

అమెరికా ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్, చివరిగా మిగిలిన ఎలక్టోరల్ ఓట్ల ఓటింగ్ లో కూడా పై చేయి సాధించారు.ఈ విషయాన్నీ అధికారికంగా ఎలక్టోరల్ కాలేజీ ధృవీకరించింది.

 Joe Biden Sensational Comments On Donald Trump, Joe Biden, Electoral Voting, Ele-TeluguStop.com

ఈ క్రమంలో అమెరికా దేశ ప్రజాలను ఉద్దేశించి మాట్లాడిన బిడెన్ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.తన గెలుపుపై ఎన్నో అనుమానాలను ప్రదర్శించిన వారికి ఈ విజయం ఓ సమాధానం అవుతుందని అన్నారు.

అమెరికా దేశం యొక్క చట్టం, రాజ్యాంగం ప్రజల విశ్వాసాలు ఈ రోజు నిజమయ్యాయని బిడెన్ తెలిపారు.

అధ్యక్షుడిగా ఉన్న డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ఫలితాలు తారుమారు చేయాలని ప్రయత్నాలు చేశారని, అయితే ఆయన ప్రయత్నాలు వృధా అయ్యాయని అన్నారు.

దిలావేల్ నుంచి ప్రసంగించిన బిడెన్ ప్రస్తుత అధ్యక్షుడిపై విమర్శలు ఎక్కుపెట్టారు.చెడుపై మంచి ఎప్పుడు గెలుస్తుందని, ఈ రోజు కూడా అదే రుజువయ్యిందని విమర్శించారు.ఎన్నికల ఫలితాలపై కోర్టులకు వెళ్ళిన సంస్కృతి ఎక్కడా లేదని ట్రంప్ చేసిన కుట్రలు అమెరికా ప్రజలు చూస్తూనే ఉన్నారని బిడెన్ ప్రకటించారు.

Telugu Corona Epidemic, Donald Trump, Electoral, Joe Biden-Telugu NRI

ట్రంప్ చేసిన ప్రతీ ప్రయత్నం విఫలం అయ్యిందని, కోర్టులలో వేసిన వ్యాజ్యాలు సుప్రీంకోర్టు తిప్పి కొట్టిందని అందుకు కోర్టుకు కృతజ్ఞతలు చెప్పారు బిడెన్.కొన్నేళ్ళుగా అమెరికా ప్రజలు స్వేచ్చగా బ్రతకలేదని, ట్రంప్ నిర్ణయాలను బలవంతంగా ప్రజలపై రుద్దారని, ఇకపై అలాంటి చెత్త చరిత్రకు కాలం చెల్లిందని బిడెన్ ప్రకటించారు.ఇకపై అమెరికాకు మంచి రోజులు రానున్నాయని, ట్రంప్ అసమర్ధత వలన అమెరికా ఆర్ధికంగా నష్టపోయిందని, తనముందున్న ఏకైక లక్ష్యం కరోనా మహమ్మారిని అమెరకా నుంచి తరిమేయడం, ఆర్ధికంగా అమెరికాను మరింత ఉన్నతస్థాయిలో నిలుపడమేనని ప్రకటించారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube