వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వెర్సటైల్ హీరో సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్ పట్టాభి దర్శకుడు.ఈ చిత్రం జూన్ 17న గ్రాండ్ రిలీజ్ అవుతుంది.ఇంతకు సత్యదేవ్ – గోపి గణేష్ కాంబినేషన్లో ‘బ్లఫ్ మాస్టర్’ వంటి సూపర్ హిట్ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే.
మరోసారి ఈ హిట్ కాంబో కలిసి చేస్తోన్న గాడ్సే చిత్రం ట్రైలర్‌ను గురువారం చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో.
నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ
‘‘135 కోట్ల మంది ప్రజలున్న ఈ దేశంలో ఈ మధ్య గాడ్సే గురించి చర్చలు నడుస్తున్నాయి.చాలా కాంట్రవర్సీలు కూడా అవుతున్నాయి.కానీ సి.కళ్యాణ్ నిర్మించిన ఈ గాడ్సే అలాంటి గాడ్సే కాదు.అయితే ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది ప్రజా ప్రతినిధులకు ఈ గాడ్సే వణుకు పుట్టిస్తాడు.ఇలాంటి గాడ్సేలు చాలా మంది రావాలంటూ యువతకు సందేశం ఇచ్చే సినిమా ఇది.గోపీ గణేష్ చాలా చక్కగా చూపించాడు.సమాజాన్ని బ్రష్టు పట్టిస్తున్న, అవినీతిమయం చేస్తోన్న రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులపై సత్యదేవ్ గాడ్సే పోరాటం చేస్తాడు.
సత్యదేవ్ ఎంత గొప్ప నటుడో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. నిద్రపోతున్న యువతను మేల్కొపే చిత్రమిది. ఈ సినిమా చూసిన తర్వాత సత్యదేవ్‌తో ఖైది సినిమా చేయవచ్చునని అనిపించింది.గోపీ గణేష్ ఎక్స్ట్రార్డినరీ సినిమాను తెరకెక్కించాడు’’ అన్నారు.
చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ
‘‘ఈ సినిమా విషయంలో ముందుగా కె.ఎస్.రామారావుగారికి థాంక్స్ చెప్పాలి.
అన్నయ్య నాపై నమ్మకంతో నాకు ఈ సినిమాను లీడ్ చేశారు.సినిమా పూర్తయిన తర్వాత నాకు అనిపించిందేంటంటే.
టి.కృష్ణగారితో నాకు మంచి అనుబంధం ఉండేది.ఆయనతో సినిమా చేయలేదనే ఫీలింగ్ ఉండేది నాకు.గోపీ గణేష్ చేసిన గాడ్సే సినిమాతో ఆ లోటును తీర్చేసింది.సమాజానికి ఉపయోగపడే సినిమా చేయాలని నిర్మాతకు ఉంటుంది.83 సినిమాలు తీసినా నా అన్ని సినిమాల్లోకి గాడ్సే సినిమాపై చాలా హ్యాపీగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను.డైరెక్టర్ గోపి గణేష్ కాస్త పిచ్చోడు.తనకు సినిమా తప్పించే మరో ఆలోచన లేదు.ప్రతి ఫేమ్ కోసం తపన పడే దర్శకుడు గోపి.తనకు డబ్బు కంటే సినిమా మీదనే ప్రేమ ఎక్కువ.తనకు సత్యదేవ్ రూపంలో వజ్రం దొరికింది.ఈ సినిమా చూసిన తర్వాత మరో సినిమా చేస్తానని గోపికి చెక్ కూడా ఇచ్చాను. రామారావుగారు, శివాజీ గణేషన్‌లా క్యారెక్టర్లో షేడ్స్‌ను చూపించగల నటుడు సత్యదేవ్.సినిమా చూసిన ఆడియెన్స్ మనం ఎందుకు అలా ఆలోచించకూడదనుకునే సినిమా అవుతుంది.
జూన్ 17న థియేటర్స్‌లో సినిమా చూడండి’’ అన్నారు.
చిత్ర దర్శకుడు గోపి గణేష్ పట్టాభి మాట్లాడుతూ
‘‘ఈ సినిమాను నా కంటే కళ్యాణ్‌గారు, రామారావు ఎక్కువగా లైక్ చేశారు.వారి మైండ్‌లో ప్రతీ ఫ్రేముని ఎక్కించేసుకున్నారు.కథ వినగానే కళ్యాణ్‌గారు గొప్ప సినిమా తీస్తున్నాం అన్నారు.
నేను, సత్యదేవ్ కలసి బ్లఫ్ మాస్టర్ మూవీ చేశాం.మళ్లీ సినిమా చేయాలనుకోగానే మరో సామాజిక సమస్యపై సినిమా చేయాలని అనుకున్నాం.ఈ దేశంలో 6.7 శాతం మంది మాత్రమే వారి చదివిన చదువుకి సరైన అర్హత ఉండే పోస్ట్ చేస్తున్నారు.మిగిలిన వాళ్లు అలా చేయడం లేదు.మీ అందరినీ మనసుల్లోని ప్రశ్నలను గాడ్సే ప్రశ్నించబోతున్నాడు.ప్రీ క్లైమాక్స్ సీన్‌ను సత్యదేవ్ సింగిల్ టేక్‌లో చేసేశాడు.బ్రహ్మాజీ, నోయల్ సహా అందరూ చక్కగా సపోర్ట్ చేశారు.
శాండీ రెండు నెలలు నాతో పాటు ఉండి సంగీతంతో ప్రాణం పోశాడు.సురేష్ సారంగం చక్కటి విజువల్స్ అందించాడు.
సాగర్ చక్కగా ఎడిట్ చేశాడు.సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్.జూన్ 17న రానున్న గాడ్సే మంచి సినిమాగా అందరినీ మెప్పిస్తుంది’’ అన్నారు.
సత్యదేవ్ మాట్లాడుతూ
‘‘ఈ సినిమాకు ఆది పురుషుడు అంటే కె.ఎస్.రామారావుగారే.
ఆయన స్టార్ట్ చేసిన ఈ సినిమా తర్వాత కళ్యాణ్‌గారు టేకప్ చేసి పూర్తి చేశారు.గాడ్సే సినిమా గురించి మాట్లాడే సందర్భంలో గోపి అన్న గురించి చెప్పాలి.
ఆయన్ని చూస్తే హిస్టరీ, ఫిజిక్స్ పాఠాలన్నీ గుర్తుకొస్తుంటాయి.ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లెమ్ వచ్చినా కదలకుండా అలా నిల్చుంటాడు.
నన్ను నా కంటే ఎక్కువగా నమ్మే వ్యక్తి.ఆయన మీద కంటే నామీదనే తనకు ఎక్కువ కాన్ఫిడెన్స్.
ఫిల్మ్ స్టోరి చెప్పినప్పుడు నేను చేయగలనా! అన్నాను.ఇది పెద్ద స్టార్ చేయాల్సిన సినిమా నాకు ఓకేనా అన్నాను.
మనం సంధించే ప్రశ్న ఎదుటి వ్యక్తిలో ఆలోచన పుట్టించిందంటే చాలు డార్లింగ్.నువ్వు చెయ్యగలవు అని నాకు చెప్పి ఒప్పించారు.
నేను-గోపి అన్న, సోసైటీలో ఉన్న చిన్న చిన్న సమస్యలు గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం.చిన్న సమస్యలనీ మనం వదిలేస్తుంటాం.
కానీ అవే పెద్ద సమస్యలు.నాలో, తనలో చాలా ఎందుకు అనే ప్రశ్నలుంటాయి.
యూత్ ఫిల్మ్ చేయవచ్చు కదా.లవ్ స్టోరిలాంటిది అంటుంటారు.
గాడ్స్ ఓ యూత్ ఫిల్మ్.లవ్ స్టోరినే కాదు.
గాడ్సే అనేది యూత్ కోసం చేసిన సినిమా.కళ్యాణ్‌గారు ప్రొడ్యూస్ చేసిన జ్యోతీలక్ష్మీ లీడ్ యాక్టర్‌గా నేను నటించిన చిత్రం.
మళ్లీ మరోసారి ఆయనతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. శాండీ, సునీల్ కశ్యప్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.
ఈ సినిమాతో ఐశ్వర్య లక్ష్మీమీనన్ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది.ఇద్దరం కలిసి నటించలేదు.
సినిమాలో ఇద్దరం డిజిటల్ మీడియంతోనే మాట్లాడుకుంటాం.తను అద్భుతంగా పెర్ఫామ్ చేసింది.
సురేష్ సారంగం అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు.జూన్ 17న గాడ్సే వస్తుంది.
అందరూ సినిమా చూడండి.అందరిలో ఓ ఆలోచన వస్తుంది’’ అన్నారు.
బ్రహ్మాజీ మాట్లాడుతూ
‘‘సినిమాలో నేను మాట్లాడాలంటే ముఖ్యంగా సత్య గురించి చెప్పాలి.3 నిమిషాల 26 సెకన్లుండే ప్రీ క్లైమాక్స్ సీన్‌ను సత్య సింగిల్ టేక్‌లో చేసేశాడు.ఇలా కూడా చేయొచ్చా అనిపిచింది.నాకు తెలిసి అంత అద్భుతంగా ఎవరూ చేయలేరు.ఎమోషనల్‌గా, తడుముకోకుండా సీన్‌ను పూర్తి చేశాడు సత్య.తన పెర్ఫామెన్స్కి నేను ఫిదా అయ్యాను.
గోపీగారు, కళ్యాణ్ గారు ఉన్న ప్రాజెక్టులో నేను భాగమయ్యాను’’ అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో అశోక్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ శాండీ సహా చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.