ఒకప్పుడు మల్టీస్టారర్ చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపేవారు.ఇప్పుడు కూడా మల్టీస్టారర్ సినిమాలు చాలానే వస్తున్నాయి.
కానీ ఒకప్పుడు ఒక హీరో సినిమాలో చిన్న పాత్ర చేయడానికి మరో స్టార్ హీరో అసలుఒప్పుకునేవారు కాదు.కానీ నేటి రోజుల్లో మాత్రం తన స్టార్ డమ్ ని పక్కన పెట్టి చిన్న పాత్ర అయినా చేసేందుకు సిద్ధమవుతున్నారు ఎంతోమంది.
ఇప్పటికే ఎన్నో సినిమాల విషయంలో ఇది ప్రూఫ్ కాగా.కమలహాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమాతో కూడా రుజువైంది.
లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమాతో పవర్ ఫుల్ కం బ్యాక్ ఇచ్చాడు లోకనాయకుడు కమల్ హాసన్.
ఈ సినిమాను లోకేష్ కనకరాజు తెరకెక్కించిన విధానం సినీ ప్రేక్షకులనే విమర్శకులను సైతం ఫిదా చేసేస్తుంది అని చెప్పాలి.
ఇక ఈ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో సూర్య చేసిన స్పెషల్ రోల్ ఒక ఎత్తు.సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారో ఇక ఆ ప్రత్యేకమైన పాత్ర గురించి కూడా అంతా మాట్లాడుకుంటున్నారు.
అంతలా తన నటనతో మెప్పించాడు తమిళ హీరో సూర్య.సినిమా అయిపోయింది అని అనుకుంటున్న సమయంలో సూర్య పాత్ర ప్రత్యక్షమవుతుంది.
సూర్య చేసిన పాత్ర పేరు రోలెక్స్.ఈ పాత్రలో సూర్య ఇచ్చిన పర్ఫామెన్స్ పిక్స్.
ఒకరకంగా సినిమా విజయంలో సూర్య పాత్ర కూడా కీలకంగా మారిపోయింది అని చెప్పాలి.
అచ్చం ఇలాగే మరికొంత మంది హీరోలు కూడా చిన్న పాత్రలో నటించేందుకు సిద్దమయ్యారూ.అదే రీతిలో ప్రస్తుతం మాస్ మహారాజా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కనిపించబోతున్నాడు.
మరోవైపు సల్మాన్ ఖాన్ సినిమా లో టాలీవుడ్ ఫ్యామిలీ హీరో వెంకటేష్ నటించబోతున్నాడు ఉన్న విషయం తెలిసిందే.ఇలా ఒక్కరు ఇద్దరు ఏంటి అందరు స్టార్ హీరోలు తమ స్టార్ డమ్ పక్కనపెట్టి చిన్న పాత్రలు కూడా చేస్తూ సరికొత్త ట్రెండ్కి నాంది పలుకుతున్నారు.