తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీదే గెలుపని తెలిపారు.
జమిలి ఎన్నికలకు కాంగ్రెస్ వ్యతిరేకమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.ఓటమి భయంతోనే వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అంశం తెరపైకి తెచ్చారని తెలిపారు.
జమిలి ఎన్నికలకు బీఆర్ఎస్ మద్ధతు ఇచ్చిందన్నారు.వన్ నేషన్ – వన్ ఎలక్షన్ తో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి పోతుందని తెలిపారు.
ఈ క్రమంలో ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం పొంచి ఉందని వెల్లడించారు.అధికారాన్ని కోల్పోవద్దని కేంద్రం కుట్రలు పన్నుతుందని ఆరోపించారు.
కాగా ఇండియా కూటమి జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.