ఓపెన్‌టాప్ కారులో నుంచి సిక్స్ ప్యాక్ బాడీ చూపించిన యువకుడు.. షాకిచ్చిన పోలీసులు..

భారతదేశంలో సన్‌రూఫ్ కార్లు( Sunroof Car ) బాగా పాపులర్ అవుతున్నాయి.కొన్ని కార్ల తయారీ కంపెనీలు బడ్జెట్ రేంజ్ కార్లలో కూడా సన్‌రూఫ్‌లను అందిస్తున్నాయి.

 Challan For Showing Six Pack Body From Cars Sunroof Details, Viral News, Latest-TeluguStop.com

దీనివల్ల కారు కొనుగోలు చేసే దాదాపు అందరికీ ఈ ఫెసిలిటీ దొరుకుతోంది.అయితే దీనిని దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగించకుండా పిచ్చి చేష్టలు చేయడానికి కొందరు వినియోగిస్తున్నారు.

దీని వల్ల చివరికి వారికే షాకులు తగులుతున్నాయి.కొందరు వ్యక్తులు కారు వేగంగా కదులుతున్నప్పుడు సన్‌రూఫ్ ఫీచర్‌ ద్వారా బయటకు చూడటం లేదా దానిపై కూర్చోవడం చేస్తున్నారు.

అలా దానిని దుర్వినియోగం చేస్తున్నారు.ఇలాంటి పనులు చేయడం చాలా డేంజర్.

ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.

Telugu Car Stunt, Cars Sunroof, Challan, Hyndai Verna, Latest, Fine, Pack, Sunro

ఇటీవల, ఉత్తరప్రదేశ్‌లో ( Uttar Pradesh ) ఒక యువకుడు కదులుతున్న కారులో సన్‌రూఫ్ నుంచి తన 6 ప్యాక్ బాడీని( Six Pack Body ) చూపిస్తూ రెచ్చిపోయాడు.అయితే దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.చివరికి పోలీసుల దృష్టికి రావడంతో వారు భారీ జరిమానా విధించారు.

కదులుతున్న కారు సన్‌రూఫ్‌లో నుంచి సిక్స్ ప్యాక్ బాడీని చూపించడం నేరం, ఎందుకంటే ఇది డ్రైవర్, ఇతర వాహనదారులకు డిస్టర్బ్ చేసే ఆకాశముంది.అకస్మాత్తుగా స్టాప్ చేసిన సందర్భంలోనూ ఇది కూడా ప్రమాదకరం.

భారతదేశంలో మోటారు వాహనాల చట్టం ప్రకారం, రహదారిని ఉపయోగించే ఏ వ్యక్తికైనా ఆటంకం కలిగించకూడదు.సన్‌రూఫ్ నుంచి బయటకు చూడటం లేదా దానిపై కూర్చోని డ్రైవర్‌ని దృష్టి మరల్చే చేయడం చట్ట విరుద్ధం.

Telugu Car Stunt, Cars Sunroof, Challan, Hyndai Verna, Latest, Fine, Pack, Sunro

ఈ వీడియోలో కారుకు స్పష్టమైన నంబర్ ప్లేట్ లేకపోవడంతో ట్రాఫిక్ నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లు అయింది.సన్‌రూఫ్‌లను పిచ్చి చేష్టలు చేసేందుకు వాడొద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు.డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, రోడ్డుపై ఉన్నప్పుడు వారి ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించకుండా ఉండాలని వారు ప్రజలను కోరారు.కారు పార్క్ చేసినప్పుడు మాత్రమే సన్‌రూఫ్ ఓపెన్ చేయాలని సూచించారు.

కారు కదులుతున్నప్పుడు సన్‌రూఫ్ నుండి బయటకు చూడవద్దని లేదా దానిపై కూర్చోవద్దని సలహా ఇచ్చారు.డ్రైవింగ్ చేయడానికి ముందు సన్‌రూఫ్ క్లోజ్ చేసి లాక్ చేయాలని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube