ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ ఘటనలో నిందితుడికి మధ్యంతర బెయిల్ వచ్చింది.ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు ఎనిమిది వారాల బెయిల్ ను మంజూరు చేసింది.
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన ధర్మాసనం బెయిల్ వ్యవధిలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లో ఉండరాదని ఆశిష్ ను ఆదేశించింది.లఖింపూర్ ఖేరీ హింస కేసులో ఆశిష్ మిశ్రా బెయిల్ ను నిరాకరించిన అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అతడి వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ ను మంజూరు చేసింది.







