మణిరత్నం కెరీర్ ఫ్లాప్ అవ్వడం వెనక అసలు కారణాలు

మణిరత్నంఒకప్పుడు దిగ్గజ దర్శకుడిగా పేరుపొందాడు.ఎన్నో క్లాసికల్ చిత్రాలను తెరకెక్కించాడు.

 Why Mani Rantnam Career Is In Down Fall ,mani Rantnam , Career Is In Down , Toll-TeluguStop.com

దేశ వ్యాప్తంగా దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు.కానీ ప్రస్తుతం తను చేసే సినిమాలు అంతగా హిట్ కావట్లేవు.

సరికదా.యావరేజ్ గా కూడా ఆడట్లేవు.

ఒకప్పుడు ఎదరులేని దర్శకుడు ఇప్పుడు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాడు? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా కొనసాగుతుంది.మణిరత్నం నిజానికి అద్భుత దర్శకుడు.

సినిమాకు సంబంధించిన 24 క్రాప్ట్స్ తెలిసిన వాడు.సినిమా నిర్మాణంలో ఆయనకు ఆయనే సాటి.

గ్రేట్ విజువల్ డైరెక్టర్స్ గా రాజమౌళి, శంకర్ ఈ మధ్య సత్తా చాటుతున్నారు కానీ ముప్పై ఏండ్లుగా మణిరత్నం.

మూడు దశాబ్దాలుగా సినిమా పరిశ్రమలోజయాపజయాలను చూసిన మణిరత్నం వాటి నుంచి ఎందుకు ముందడుగు వేయలేకపోతున్నాడు? అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్న.ఆయన మంచి టెక్నిషియన్.అంతకు మించి సినిమాను చాలా ఆర్టిస్టిక్ గా తీస్తాడు.అయితే ఆ సినిమా కమర్షియల్ గా ఆడుతుందా? లేదా? అనేది చెప్పే ఓ వ్యక్తి ఉండాలి.

Telugu Ar Rahman, Career, Carrier, Venkataswaran, Elder Brother, Kollywood, Mani

ఎయిటీస్ లో అయితే తన సోదరుడు జీవీ ఓ క్రిటిక్ గా ఉండేవాడు.నిజానికి జీవీ ఓ చార్టెడ్ అకౌంటెంట్.అంతేకాదు.

సినిమా వ్యాపారంలో ఆయనది అందివేసిన చేయి.కమర్షియల్ అంశాల గురించి బాగా తెలిసిన వ్యక్తి.

అంతేకాదు ఆయన డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, ఫైనాన్స్ తీసుకురావడం లాంటి పనులు సక్సెస్ ఫుల్ గా కొనసాగించే వాడు.జీవీ, మణిరత్నం కలిసి పనిచేసిన సినిమాలన్నీ విజయంవంత అయ్యాయి.

ఆ తర్వాతి కాలంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.ఆ తర్వాత కొంత కాలానికి జీవీ ఆత్మహత్య చేసుకున్నాడు.

Telugu Ar Rahman, Career, Carrier, Venkataswaran, Elder Brother, Kollywood, Mani

జీవీ చనిపోయాక మణిరత్నం పరిస్థితి మారింది.అద్భుతమైన టాలెంట్ మణిరత్నం సొంతం అయిన .బిజినెస్ విషయంలో ఆయన ఫ్లాప్ అనే చెప్పుకోవచ్చు.ఒక దర్శకుడు సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలి.అలా ట్రిక్స్ బాగా తెలిసిన వ్యక్తి రాజమౌళి.ఎక్కడ ఏమూలన సినిమా ఆడుతుందని తెలిసినా అక్కడికి తన సినిమాను తీసుకెళ్తాడు.కానీ మణిరత్నం సినిమాలను తీస్తాడు కానీ.

ప్రమోషన్ విషయంలో చాలా పూర్.అందుకే ఆయన సినిమాల్లో ఎక్కువగా పరాజయం పాలవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube