మహారాష్ట్రలోని పూణేలో( Pune ) ఒక అపార్ట్‌మెంట్‌లో డ్రైవర్( Driver ) చేసిన చిన్న తప్పిదం పెను ప్రమాదానికి దారి తీసింది.పూణే నగరంలోని విమన్ నగర్‌లో గల శుభ్ గేట్‌వే అపార్ట్‌మెంట్‌లో ఈ సంఘటన జరిగింది.
పార్కింగ్ కాంప్లెక్స్‌లో రివర్స్ గేర్‌ను( Reverse Gear ) పొరపాటున వేయడం వలన, ఒక కారు అదుపుతప్పి మొదటి అంతస్తు గోడను బద్దలు కొట్టి కింద పడిపోయింది.అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.వీడియోలో కార్ రివర్స్‌లో వెళ్లి పార్కింగ్( Parking ) గోడను బద్దలు కొడుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అనంతరం కారు అమాంతంగా కింద పడిపోయింది.ఆ సమయంలో వచ్చిన భారీ శబ్ధానికి చుట్టుపక్కల వారు బయటికొచ్చి ఘటనను చూసి షాక్‌కు గురయ్యారు.
ఇకపోతే, డ్రైవర్ అనుకోకుండా రివర్స్ గేర్ వేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.కారు అదుపుతప్పి పార్కింగ్ కాంప్లెక్స్ గోడను బలంగా ఢీకొట్టింది.వాహనం మొత్తం గోడను ఢీకొట్టి ఆపై కింద పడిపోయింది.ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల ఎవరికీ గాయాలు కాలేదు.ఘటన జరిగిన తర్వాత స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి, డ్రైవర్‌ను కారులో నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.నెటిజన్లు పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణ నాణ్యతపై ప్రశ్నిస్తున్నారు.గోడలు అంత సులభంగా కూలిపోవడం ఏంటని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
అలాగే ఈ విషయంలో అపార్ట్‌మెంట్ నిర్వాహకులు బాధ్యత వహించాలంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఉండేందుకు, పార్కింగ్ స్థలాలను మరింత సురక్షితంగా తీర్చిదిద్దడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే వాహనదారులు తమ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కామెంట్ చేస్తున్నారు.ఈ సంఘటన వలన డ్రైవర్ క్షేమంగా ఉండడం ఎంతో ఊరటనిచ్చే విషయం.
అయితే, ఇలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా అవసరం.