టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అఖండ 2.( Akhanda 2 ) ఇటీవలే డాకు మహారాజ్( Daaku Maharaaj ) సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య బాబు.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.ఇప్పుడు అదే ఊపుతో మరిన్ని సినిమాలలో నటిస్తున్నారు.
అందులో భాగంగానే గతంలో బాలకృష్ణ నటించిన అఖండ మూవీ సీక్వెల్లో నటిస్తున్నారు బాలయ్య బాబు.ఈ సినిమాకు బోయపాటి శ్రీను( Boyapati Srinu ) దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.2021 లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ని తెరకెక్కించబోతున్నారు మూవీ మేకర్స్.
అయితే రీసెంట్ గానే మహా కుంభమేళాలో అఖండ తాండవంకు సంబందించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ చేపట్టారు బోయపాటి శ్రీను.ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లాలోని కృష్ణా నదిలో పడవ ప్రయాణం చేస్తూ బోయపాటి లొకేషన్స్ ఫైనల్ చేసుకున్నారు.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.అఖండ 2 సినిమా అఖండ విజయాన్ని సాధిస్తుందని అభిమానులు కూడా భావిస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్( Thaman ) ఈ సినిమాపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తమన్ చేసిన వాక్యాలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.తాజాగా డాకు మహారాజ్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న తమన్ అఖండ 2 సినిమా గురించి స్పందిస్తూ. అఖండ తాండవం మాములుగా ఉండదు.
మీరు ముందే ప్రిపేర్ అవ్వండి.మాములు కసిగా లేరు బోయపాటి శ్రీను గారు అక్కడ.
అఖండ 2 ఇంటర్వెల్ కే డబ్బులు ఇచ్చేయవచ్చు అంటూ థమన్ అఖండ 2 మూవీపై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.సందర్భంగా తమను చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే తమన్ చేసిన వాఖ్యలను బట్టి చూస్తుంటే అఖండ 2 సినిమా భారీ విజయం సాధించడం పక్కా అని తెలుస్తోంది.తమన్ చేసిన వ్యాఖ్యలతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.