అమెరికాలో అక్రమ నివాసం .. 18000 వేల మంది భారతీయుల బహిష్కరణకు ఏర్పాట్లు

అమెరికాలో( America ) అక్రమంగా నివసిస్తున్నందుకు గాను బహిష్కరణను ఎదుర్కొంటున్న దాదాపు 18 వేల మంది భారతీయ పౌరుల( Indian Citizens ) పత్రాలను భారత్ ధృవీకరించింది.

ఈ జాబితాను అమెరికా ప్రభుత్వంతోనూ పంచుకుందని వార్తలు వస్తున్నాయి.అమెరికా నుంచి అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) ప్రభుత్వం.

దీంతోత దాదాపు 18 వేల మంది భారతీయులను తిరిగి వారిని స్వదేశానికి పంపించే విషయాన్ని అధికారికంగా చేపట్టింది.

అమెరికాలో అక్రమ వలసదారుల కేసులు ఎక్కువగా ఉండటంతో బహిష్కరణల సంఖ్య ప్రస్తుతం 2 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది.

అమెరికాకు అక్రమంగా వెళ్లిన భారతీయుల్లో పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు.

భారతదేశంలో వెరిఫికేషన్ , బహిష్కరణ నిరంతర ప్రక్రియ అని.ఇండియా ఎప్పుడూ అక్రమ వలసలకు( Illegal Migrants ) మద్దతు ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఎవరైనా భారతీయుడు అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు తేలితే.వారి పత్రాలు సక్రమంగా ఉంటే వారి బహిష్కరణను అంగీకరిస్తామన్నారు.

"""/" / మంగళవారం భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌తో( EAM S Jaishankar ) జరిగిన సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రూబియో( Marco Rubio ) ఈ అక్రమ వలసల అంశాన్ని ప్రస్తావించారు.

ఆర్ధిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశంతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్లు అమెరికా వర్గాలు తెలిపాయి.

అలాగే అక్రమ వలసలకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించాలని ట్రంప్ పరిపాలనా యంత్రాంగం తరపున రూబియో తెలిపారు.

"""/" / అక్రమ వలసదారులను స్వీకరించడంలో భారతదేశం వైపు నుంచి ఏదైనా సమస్యలు వస్తే అది చట్టబద్ధంగా అమెరికాకు వచ్చే భారతీయులపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో అమెరికాకు ఢిల్లీ అన్ని రకాలుగా అండగా నిలవడంతో విద్యార్ధి వీసా, హెచ్ 1 బీ వీసాలు పెద్ద సంఖ్యలో భారతీయులకు మంజూరయ్యాయి.

అధికారిక గణాంకాల ప్రకారం.2023లో మంజూరు చేయబడిన 3,86,000 హెచ్ 1 బీ వీసాలలో మూడొంతుల మంది భారతీయులకే దక్కాయి.

వీడియో: పురిటి నొప్పుల్లో ఉన్న జీబ్రాపై మగ జీబ్రా అరాచకం.. కళ్లముందే బిడ్డను చంపేసింది!