నేటి ఆధునిక కాలంలో వయసుతో సంబంధం లేకుండా దాదాపు అందరినీ ఒత్తిడి తరచూ పలకరిస్తూనే ఉంటుంది.ఒత్తిడి అనేది ఒక మానసిక సమస్య.
దీనిని ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత ముప్పు పెరుగుతుంది.అయితే ఒక్కసారి ఒత్తిడి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటుంది.
ఆ సమయంలో ఏ పని పైన దృష్టి సారించలేకపోతుంటారు.మూడీగా మారిపోతారు.
అయితే అలాంటి టైం లో ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను తీసుకుంటే క్షణాల్లో ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందొచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో ఆఫ్ టేబుల్ స్పూన్ డ్రై ఒరెగానో, హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తురుము వేసుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.
అనంతరం మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ తేనెను మిక్స్ చేస్తే మన స్ట్రెస్ బస్టర్ డ్రింక్ సిద్ధం అయినట్టే.
ఈ డ్రింక్ ను ఒత్తిడితో సతమతమవుతున్నప్పుడు తీసుకుంటే క్షణాల్లో ఉపశమనం లభిస్తుంది.బాడీ మరియు మైండ్ రిలాక్స్ అయిపోతాయి.అంతేకాదు ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు దూరం అవుతాయి.
జీర్ణవ్యవస్థ పని తీరు చురుగ్గా మారుతుంది.గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
అలాగే ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల బాడీ డీటాక్స్ అవుతుంది.వేగంగా బరువు తగ్గుతారు.
మరియు దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు సైతం త్వరగా నయం అవుతాయి.