రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు సాధించిన వ్యక్తి లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ. సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి అంటూ… ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు అంటూ ప్రచారం చేస్తూ, సామాజిక అంశాలతో స్పందిస్తూ లోక్ సత్తా ను పలు రాష్ట్రాలకు విస్తరించారు.ఐఏఎస్ అధికారిగా మంచి పేరు ను సంపాదించుకున్న ఆయన 1996లో తన ఐఏఎస్ కు రాజీనామా చేశారు.2009లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.
ఐదేళ్ల పాటు నియోజకవర్గ అభివృద్ధితో పాటు , అనేక సమస్యలపై గళం ఎత్తేవారు.శాసనసభలో ఉమ్మడి ఏపీలోని అనేక సమస్యల పై జెపి ప్రసంగించేవారు.ఆయన ప్రసంగానికి పార్టీలకతీతంగా అందరి నుంచి ప్రశంసలు అందేవి.జేపీ సూచనలు అమలు చేసేందుకు అధికారంలో ఉన్న పార్టీలు ప్రయత్నాలు చేసెందుకు ఆసక్తి చూపించాయి అంటే… ఆ స్థాయిలో తన సత్తా నిరూపించుకున్నారు.2014లో మల్కాజ్ గిరి ఎంపీగా పోటీ చేసిన జెపి ఓటమి చెందారు.ఏపీ , తెలంగాణ విభజన తరువాత రాజకీయంగాను ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆంధ్ర ప్రాంతానికి చెందిన జేపి తెలంగాణలో ఇక పోటీ చేసినా ప్రయోజనం ఉండదని అభిప్రాయంతో రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారు.అయితే గత కొద్దిరోజులుగా ఆయన యాక్టివ్ గా ఉంటున్నారు.
వివిధ అంశాలపై స్పందిస్తున్నారు.ఆయన కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో … రాబోయే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు జేపీ సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.
జెపి కి ఉన్న వ్యక్తిగత ఇమేజ్ కారణంగా ఆయన గెలుస్తారని చాలామంది భావిస్తున్నారు.విభజన సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించాలంటే జేపీ వంటి మేధావి అవసరమని, ప్రస్తుతం ఉన్న అన్ని పార్టీలు కేంద్రాన్ని ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నాయని, అదే జేపీ వంటి వారైతే ఏపీకి ప్రయోజనం చేకూరే విధంగా వ్యవహరించగలరనే అభిప్రాయులు జనాల నుంచి వ్యక్తమవుతున్నాయి.అయితే ఎంపి స్థానానికి పోటీ చేయాలంటే ఆర్థికంగా స్థితిమంతులై ఉండాలని అభిప్రాయం అందరిలోనూ ఉన్నా.ఎంపి స్థానానికి వచ్చేసరికి జనాలు ఆలోచిస్తారని, సరైన వ్యక్తినే ఎంపిక చేసుకుంటారనే అంచనాలతో జేపీ ఇప్పుడు విజయవాడ బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట.