తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నందమూరి బాలకృష్ణ( Balakrishna )ఒకరు.ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఈయన వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈయన గురించి ఒక వార్త వైరల్ గా మారింది.బాలకృష్ణ ప్రస్తుతం వృత్తి పరంగా ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం సంతోషంగా లేరని తెలుస్తుంది.
ఈయన ఎన్ని కోట్లు సంపాదించిన ఒక విషయంలో సంతోషంగా లేరని తెలుస్తుంది.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అందుకున్న ఈయనకు తీరని కోరిక ఉందని తెలుస్తుంది.బాలకృష్ణ వేల కోట్లు సంపాదించిన తీరని కోరిక ఉందని తెలుస్తుంది.మరి బాలయ్యకు తీరని ఆ కోరిక ఏంటీ అనే విషయానికి వస్తే.
బాలయ్యకు ముందు నుంచి కూడా అమ్మాయిలు అంటే ఎంతో ఇష్టం అనే సంగతి తెలిసిందే .అయితే తన ఇద్దరు కూతుర్లకు పెళ్లి చేసిన ఇద్దరికీ కూడా కొడుకులు ఉన్నారు.అయితే ఈయనకు మనవరాళ్లతో ఆడుకోవాలని చాలా కోరికగా ఉందట.అయితే ఇప్పటికీ ఆ కోరిక తీరలేదని తెలుస్తుంది.

ఇక తన పెద్ద కుమార్తె బ్రాహ్మిని( Brahmani ) కి కుమారుడు అలాగే చిన్న కుమార్తె తేజస్విని ( Tejaswini ) కి కూడా కుమారుడు పుట్టడంతో తనకు మనవరాలు లేరన్న కోరిక అలాగే ఉంది.ఇలా బాలయ్యకు ఇద్దరు మనవాళ్ళు కావడంతో మనవరాలు కావాలనే కోరిక ఉందనే విషయం తెలియడంతో త్వరలోనే ఈయన కోరిక నెరవేరాలని కొందరు ఆకాంక్షిస్తున్నారు.ఇలా కూతుర్లు కారణంగా బాలయ్య కోరిక తీరకపోయినా తన కుమారుడికి కూతురు పుడితే బాలయ్య కోరిక తప్పకుండా తీరుతుంది అంటూ మరికొందరు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు.ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే భగవంత్ కేసరి ( Bhagavanth Kesari ) సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నటువంటి బాలయ్య తదుపరి సినిమా బాబి డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే.