భారతీయ సిని నటి నివేదా థామస్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకే కాకుండా.తమిళం, మలయాళం ప్రేక్షకులకు కూడా తెలిసిందే.
బాలనటిగా మలయాళం, తమిళం భాషలో తెరకెక్కిన సినిమాలలో నటించగా.ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది.అంతేకాకుండా తెలుగు సినిమాలలో తన నటనకు మంచి గుర్తింపు అందుకుంది.
2016లో హీరో నాని నటించిన జెంటిల్ మెన్ సినిమాలో హీరోయిన్ గా తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది.తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న నివేదా.తర్వాత ఏడాదిలో వరుస సినిమాల్లో నటించింది.ఇక గత ఏడాది ‘వి’ సినిమాలో నటించగా ఈ సినిమా అంతా విజయాన్ని అందుకోలేకపోయింది.
ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన వకీల్ సాబ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో నివేదా నటన ఎంతగానో ఆకట్టుకుంది.అంతే కాకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఇక సినిమా సక్సెస్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపింది.అంతేకాకుండా తాను నటించే సినిమాకు ఒక్క ప్రేక్షకుడు వచ్చినా కూడా చాలంటుంది నివేదా.

వకీల్ సాబ్ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉందని, ఈ సినిమా గురించి జనం అంతా చెబుతుంటే ఇది కదా సక్సెస్ అని అనిపించిందని తెలిపింది.ఇక ఈ సినిమా గురించి కొన్ని విషయాలు తెలుపగా.తాను ఇప్పటివరకు లెక్కేసుకోలేదంటూ.డెఫినెట్గా ఇది ఒక మంచి జర్నీ అని తెలిపింది.ఇప్పటికీ తాను 8 సినిమాల్లో నటించగా.తన చదువు విషయం పట్ల మధ్యలో సినిమాలు చేయలేదని తెలిపింది.
ఇక రానున్న ఐదేళ్లలో ఇంతకు రెట్టింపు సినిమాలలో కనిపిస్తానంటూ.సినీ ఇండస్ట్రీ తనకెంతో ఇచ్చిందని, తిరిగి ఆ పరిశ్రమ కు ఏదైనా ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది.యాక్టర్ గానే కాకుండా ఏ రూపంలో నైనా సినీ పరిశ్రమకు చేయాల్సింది చేస్తానంటూ.తన సినిమా చూడ్డానికి ఒక్క ఆడియన్ ఉన్నా.
సినిమా చేస్తానని తెలిపింది.మొత్తానికి ఈ సినిమా తో నివేదా థామస్ మంచి క్రేజ్ ను సంపాదించుకుందని అర్థమవుతుంది.