నాగ చైతన్య ప్రస్తుతం చేస్తున్న లవ్ స్టొరీ సినిమా దాదాపుగా పూర్తి అయింది.ఈ లాక్ డౌన్ లేకుండా ఉంటే ఇప్పటికే లవ్ స్టొరీ విడుదల అయ్యేది.
ప్రస్తుతం షూటింగ్స్ అన్ని ఆగిపోవడంతో చైతూ మూవీ మరింత వాయిదా పడబోతుంది.ప్రస్తుతం చైతు తన తదుపరి సినిమాకు సంబంధించిన చర్చల్లో పాల్గొంటున్నాడు.
ఇప్పటికే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ అక్కినేని హీరో సినిమా ఖరారు అయ్యింది.
ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరిగింది.అయితే అవి పుకార్లు మాత్రం అయ్యి ఉంటాయి.
ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఎలాంటి ప్రకటన రాలేదు.ఇక ఈ సినిమాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని భావిస్తున్నారట.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం స్క్రిప్ వర్క్ దాదాపుగా పూర్తి అయింది.లాక్ డౌన్ పూర్తి అయిన వెంటనే సినిమా షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నారు.అందుకు సంబంచిన చర్చలు కూడా పూర్తి అయ్యాయి.సినిమా పూర్తిగా హైదరాబాద్, చెన్నై నగరాల్లో షూట్ చేయాలని కూడా నిర్ణయించుకున్నారు.
ఈ సినిమా ను కేవలం అయిదు నెలల్లో పూర్తి చేయాలని విక్రమ్ చాలా పట్టుదలతో ఉన్నాడు.ఈ సినిమా షూటింగ్ లో ఎలాంటి గ్యాప్ లేకుండా కంటిన్యూగా నిర్వహించేందుకు చైతూ కూడా డేట్లు ఇచ్చేందుకు ఒకే అన్నాడట.
ఈ విషయంలో అక్కినేని ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు.వచ్చే ఏడాది చైతూ రెండు లేదా మూడు సినిమాలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.