తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 అప్పుడే చూస్తుండగానే 5 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని ఆరవ వారం కూడా ముగింపు దశకు చేరుకుంది.ఇప్పటికే ఐదుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కాగా ఆరోవారం ఎలిమినేషన్ సమయం కూడా దగ్గర పడింది.
ఇప్పటికీ హౌస్ లో నుంచి అభినయ శ్రీ, షాని, నేహా చౌదరి, ఆరోహి, చంటి ఎలిమినేట్ అయ్యారు.దీంతో ఆరో వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక ఈ వారం కీర్తి, ఆదిరెడ్డి, గీతూ, బాలాదిత్య, సుదీప, శ్రీహాన్, రాజ్, శ్రీసత్య, మెరీనా నామినేషన్‌లో ఉన్నారు.
వీరిలో శ్రీహాన్, ఆదిరెడ్డి, గీతూ, శ్రీసత్యలు ఓటింగ్‌లో దుమ్ము దులిపేశారు.
రాజ్, కీర్తిలకు కూడా బాగానే ఓట్లు పడినట్లు తెలుస్తోంది.ఇక మిగిలిన కంటెస్టెంట్ లు సుదీప, మెరీనా, బాలాదిత్య లు డేంజర్ జోన్‌లో ఉండిపోయారు.
వారి ముగ్గురిలో ఎవరైనా ఈ 6 వ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అయితే మెరీనా, బాలాదిత్య, సుదీప ఈ ముగ్గురిలో మెరీనా సేఫ్ కావడంతో చివరికి సుదీప బాలాదిత్య మాత్రమే మిగిలారని తెలుస్తోంది.

ఇక బాలాదిత్య సుదీప లలో సుదీప ఎలిమినేట్ అయినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆరో వారం నిజంగానే సుదీప ఎలిమినేట్ అయ్యిందా లేదా తెలియాలి అంటే రేపటి పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే మరి.అయితే గతవారం అనగా ఐదవ వారం హౌస్ నుంచి తప్పకుండా చంటి ఎలిమెంట్ అవుతాడు అంటూ వార్తలు ముందుగానే వినిపించిన సంగతి తెలిసిందే.అనుకున్న విధంగానే చంటి ఎలిమినేట్ అయ్యాడు.
అలా ఈ వారం కూడా సుదీప ఎలిమినేట్ అయితే అభిమానుల అంచనాలు మరొకసారి నిజం అని రుజువైనట్లే అని చెప్పవచ్చు.