ప్రముఖ కమెడియన్ ఎల్బీ శ్రీరామ్ ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగారు.అయితే ఈ మధ్య కాలంలో ఎల్బీ శ్రీరామ్ కనిపించిన సినిమాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.
ఎల్బీ శ్రీరామ్ వరుస సినిమాల్లో నటిస్తే బాగుంటుందని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు.అమృతం ద్వితీయంలో నటించిన ఎల్బీ శ్రీరామ్ ఆ సిరీస్ ద్వారా మంచి పేరును సంపాదించుకున్నారు.
అమృతం ద్వితీయంకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
తాజాగా ఎల్బీ శ్రీరామ్ సినిమాలకు దూరం కావడానికి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తనకు నచ్చనిది ఏదైనా వదులుకుంటానని నచ్చితే మాత్రం సంతృప్తిగా జీవనం సాగిస్తానని ఎల్బీ శ్రీరామ్ పేర్కొన్నారు.పది సంవత్సరాల పాటు ఎన్నో మెసేజ్ ఓరియెంటెడ్, కామెడీ మూవీస్ లో నటించానని ఆయన కామెంట్లు చేశారు.
ఇప్పటివరకు నేను 500 సినిమాలలో యాక్ట్ చేశానని ఆయన తెలిపారు.
అమ్మో ఒకటో తారీఖు మూవీ తనలోని కొత్త నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసిందని ఎల్బీ శ్రీరామ్ కామెంట్లు చేశారు.
ప్రస్తుతం తాను లఘుచిత్రాల నిర్మాణంపై దృష్టి పెట్టానని అందుకే సినిమా రంగానికి దూరంగా ఉంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు.సినిమా రంగంపై అభిమానంతో ఎల్బీ శ్రీరామ్ తీసుకుంటున్న నిర్ణయాలపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ఎల్బీ శ్రీరామ్ మరెన్నో సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సమాజ హితం కోసం షార్ట్ ఫిల్మ్స్ తీయాలని అనుకుంటున్నానని ఎల్బీ శ్రీరామ్ చెప్పుకొచ్చారు.ఎల్బీ శ్రీరామ్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.ఎల్బీ శ్రీరామ్ ప్రేక్షకుల హృదయాల్లో మంచి కమెడియన్ గా నిలిచిపోయారు.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని కడుపుబ్బా నవ్వించే కమెడియన్ల కొరత వేధిస్తున్న సంగతి తెలిసిందే.