మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా మారింది.బీజేపీ మరియు శివసేన పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి.
ఈ కూటమికి ప్రభుత్వ ఏర్పాటు సరిపోయే సీట్లు దక్కాయి.కాని శివసేన పార్టీ ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాలంటూ పట్టుబడుతుండటంతో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్దం నెలకొంది.
శివసేన పార్టీ రెండున్నర సంవత్సరాలు అధికారం ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బీజేపీతో ఆ పార్టీకి చీలిక వచ్చింది.ఈ సమయంలో ఎన్సీపీ మరియు కాంగ్రెస్‌లు కలిసి శివసేన మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అయ్యింది.
కొన్ని రోజుల క్రితం ఎన్సీపీ అధినేత శరత్ పవార్ కూడా శివసేన మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చలు జరిపాడు.రెండు పార్టీలను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు.
ఇదే శరత్ పవార్ ఫలితాలు వచ్చిన తర్వాత శివసేన ముఖ్యమంత్రి పీఠంను కోరడంలో తప్పులేదు అన్నాడు.కాని ఇప్పుడు శివసేన పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇచ్చేది లేదు అంటూ తేల్చి చెప్పడం జరిగింది.
దాంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.బీజేపీ మరియు శివసేన తప్ప మరే ఆప్షన్ లేదు.
కాని ఆ రెండు పార్టీలు మాత్రం ఢీ అంటే ఢీ అంటున్నాయి.చివరకు బీజేపీ కాస్త తగ్గి సీఎం పీఠం ఇవ్వాల్సి రావచ్చు అంటూ ప్రచారం జరుగుతోంది.