పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె పాకిస్థాన్ ముస్లిం లీగ్ నేత మర్యమ్ నవాజ్ షుగర్ మిల్స్ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో ఆమెను నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో(ఎన్ ఏ బీ) అధికారులు ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.
పాకిస్తాన్‌లో చౌదురీ షుగర్ మిల్స్ కేసులో మర్యమ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఏబీ కోర్టు పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆమె పట్టించుకోలేదు.
అయితే తండ్రిని కలవడానికి వచ్చిన ఆమెను ఎన్ ఏ బీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.ఆమె తండ్రి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ లాహోర్ కోఠ్ లక్‌పత్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే నవాజ్ షరీఫ్‌ను కలిసేందుకు ఆమె గురువారం వచ్చారు.

దీంతో సమాచారం అందుకున్న అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.మర్యమ్ నవాజ్ సహా ఆమె కుటుంబం పెద్ద మొత్తంలో లాభం పొందారని ఎన్ఏబీ ఆరోపిస్తుంది.ఎన్ఏబీ అదుపులో ఉన్న మర్యమ్‌ను ఛౌదురి షుగర్ మిల్స్‌కు సంబంధించి పెద్ద షేర్‌హోల్డర్‌గా ఎలా అయ్యారనే కోణంలో ప్రశ్నిస్తున్నారు.