బాలీవుడ్ లో ఇటీవల విడుదలైన కబీర్ సింగ్ ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్ గా వచ్చిన ఆ మొదటి సినిమా యాక్టర్స్ కెరీర్ కి కూడా మంచి బూస్ట్ ఇచ్చింది.
అయితే ఆ సినిమా సక్సెస్ కావడంతో అందరూ ఇప్పుడు తమిళ్ రీమేక్ ఆదిత్య వర్మ వైపే చూస్తున్నారు.

విక్రమ్ తనయుడు ధృవ్ నటించిన ఆదిత్య వర్మ ఒరిజినల్ కాన్సెప్ట్ తో పోలిస్తే ఏ మాత్రం తేడా రావద్దని నిర్మాతలు మళ్లీ రీ షూట్ చేసిన విషయం తెలిసిందే.అయితే సందీప్ వంగ శిష్యుడు గిరిశయ సినిమాను అద్భుతంగా ఒరిజినల్ ఫీల్ ఏ మాత్రం మిస్ అవ్వకుండా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.సినిమాను చుసిన ధృవ్ చాలా హ్యాపీ గా ఉన్నాడట.

ఇకపోతే సినిమా రిలీజ్ డేట్ ను వీలైనంత త్వరగా ఎనౌన్స్ చేయాలనీ చిత్ర యూనిట్ చర్చలు జరుపుతోంది.సెప్టెంబర్ 27వ తేదీని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.ఆ టైమ్ లో పెద్ద సినిమాలు కూడా లేవు.అలాగే తమిళనాడు కొత్త ఏడాది కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి హాలిడేస్ ఉంటాయి.అదే సినిమాకు సరైన తేదీ అని విక్రమ్ ఆలోచినట్లు టాక్.త్వరలోనే విడుదల తేదీని ఒక పోస్టర్ ద్వారా తెలియజేయనున్నారట.
.