తల్లిదండ్రులకు అతి పెద్ద టాస్క్ ఏదైనా ఉందంటే అది పిల్లల పెంపకమే అని చెప్పాలి.పిల్లలు పుట్టిన తరువాత వారి దశల వారీగా ఎదుగుతూ తల్లిదండ్రులకు పెద్ద టాస్క్ ని అందిస్తారు.
అయితే పిల్లలు పుట్టాక మూడో నెలకు నవ్వులు చిందించడం,నాలుగో నెలలో బోర్లా పడడం,ఆరో నెల వచ్చే సరికి పాకడం, ఏడు,ఎనిమిది నెలల్లో పల్లు రావడం ఇలా దశల వారీగా వారి ఎదుగుదల అనేది ఉంటుంది.కనియె తమిళనాడు రాష్ట్రం సేలంలో ఒక బుడ్డోడు మాత్రం పళ్లికిలిస్తూ భూమి మీదకు వచ్చాడు.
మీరు విన్నది నిజమే నిజంగా నోట్లో రెండు దంతాల తో పుట్టాడు ఆ బుడ్డోడు.సేలం లోని వాడుగపట్టికి చెందిన రమేష్,విజయలక్ష్మి దంపతులకు ఈనెల 1 న మగశిశువు జన్మించాడు.
అయితే పుట్టిన సమయంలో ఆ బుడ్డోడి కి రెండు దంతాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.అయితే అప్పుడే పుట్టిన పిల్లల్లో దంతాలు చాలా సున్నితంగా ఉంటాయి అని అవి ఒక్కోసారి ఊడిపోయి ఊపిరితిత్తులోకి చేరే ప్రమాదం ఉంటుంది అని వైద్యులు చెబుతున్నారు.

దీనితో శస్త్రచికిత్స చేసి వెంటనే ఆ రెండు దంతాలను తొలగించినట్లు వైద్యులు తెలిపారు.ఒకవేళ ఆ దంతాలు ఉండి ఉంటె ఆ చిన్నారి తల్లి పాలు తాగేందుకు కూడా బాగా ఇబ్బంది పడి ఉండేవాడని వైద్యులు చెబుతున్నారు.శస్త్రచికిత్స అనంతరం ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తుంది.







