ప్రచారానికి కాంగ్రెస్ సన్నద్ధం...పట్టు నిలుపుకోవడానికేనా?

హుజూరాబాద్ ఉప ఎన్నిక సమరానికి కాంగ్రెస్ సన్నద్దమవుతోంది.మొదట్లో రేవంత్ వ్యాఖ్యలను బట్టి హుజూరాబాద్ ఉప ఎన్నికను లైట్ తీసుకున్నారని అందరూ భావించినా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ తరువాత అత్యంత బలమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నది సుస్పష్టం.

 Congress Ready For Campaign ... To Retain Gri Huzurabad Bypoll,  Trs Party, Balm-TeluguStop.com

ఎందుకంటే ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ నుండి పోటీ చేసిన సందర్భంలో అదే విధంగా పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుండి పోటీ చేసిన సందర్భంలో ఈటెల రాజేందర్ ను ఓడిస్తారేమో  అన్నంతలా పాడి కౌశిక్ రెడ్డికి ఓట్ల శాతం వచ్చింది.అయితే తరువాత జరిగిన పరిస్థితులు మనకు తెలిసిందే.

అయితే కాంగ్రెస్ బలంగా ఉన్న చోట తమ పట్టు నిలుపుకోవడానికి సన్నద్దమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.అందుకే తాజాగా 20 మందితో కూడిన క్యాంపెయినర్ ల జాబితాను విడుదల చేసారు.

ఇక నేటి నుండి క్యాంపెయినర్ లు తమకు ఇచ్చిన బాధ్యతలను హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కు మద్దతుగా నిర్వహించనున్నారు.

అయితే ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ లు ప్రచారంలో దూసుకుపోతున్న ప్రస్తుతం తరుణంలో ఇక కాంగ్రెస్ కూడా ప్రచారానికి సన్నద్దమవుతున్న తరుణంలో ఇక సమరానికి టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సిద్దమయినట్టే అని మనం అర్ధం చేసుకోవచ్చు.

అయితే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీని వెనక్కి నెట్టి కాంగ్రెస్ సత్తా చాటుతుందా అనేది మనం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉంది.అయితే ఇప్పటికే వెంకట్ హుజూరాబాద్ లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న తరుణంలో కాంగ్రెస్ తన పూర్వ వైభవాన్ని మరల చాటుతుందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది.

అయితే ప్రస్తుతం బీజేపీకి హుజూరాబాద్ లో అంతగా బలం లేకపోయినా ఈటెల అభ్యర్థి కావడంతో బీజేపీకి ప్రాధాన్యత లభిస్తున్న పరిస్థితి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube