వినరో భాగ్యము విష్ణు కథ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. మూవీ ఎలా ఉందంటే?

టాలెంట్ ఉన్నా ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు.వినరో భాగ్యము విష్ణుకథ సినిమాతో కిరణ్ అబ్బవరం ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

 Vinaro Bhagyamu Vishnukatha Movie Plus And Minus Points Details Here Goes Viral-TeluguStop.com

నైబర్ నంబర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుందని కిరణ్ అబ్బవరం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా కిరణ్ అబ్బవరం హిట్ కొట్టాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా కథ విషయానికి వస్తే లైబ్రేరియన్ గా పని చేసే విష్ణు (కిరణ్ అబ్బవరం) తాత దగ్గర పెరుగుతాడు.బాల్యంలోనే తల్లీదండ్రులను కోల్పోయిన విష్ణు నైబర్ నంబర్ ద్వారా దర్శన అనే అమ్మాయి ప్రేమలో పడతాడు.

దర్శనకు నైబర్ నంబర్లలో ఒకవైపు విష్ణు ఉండగా మరోవైపు శర్మ(మురళీశర్మ) ఉంటాడు.

Telugu Kiran Abbavaram, Murali Sharma, Tollywood, Vinarobhagyamu-Movie

అయితే ఒక సందర్భంలో దర్శన శర్మను చంపుతుంది.ఈ కేసులో జైలుకు వెళ్లిన దర్శనను విష్ణు ఎలా కాపాడుకున్నాడు? శర్మకు మంత్రి కావాలనుకుంటున్న ఒక ఎమ్మెల్యేకు రిలేషన్ ఏమిటి? నైబర్ నంబర్ కాన్సెప్ట్ తో హీరో విలన్లను ఎలా పట్టుకున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.శివరాత్రికి కుటుంబంలో కలిసి సినిమా చూడాలని భావించే ప్రేక్షకులకు ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

Telugu Kiran Abbavaram, Murali Sharma, Tollywood, Vinarobhagyamu-Movie

కథ, కథనంలో కొన్ని లోపాలు ఉన్నా ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించారు.కొన్ని కామెడీ సీన్లు నవ్వించగా ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను అలరిస్తుంది.Chaitan Bharadwaj సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయింది.నిర్మాణ విలువలు బాగున్నాయి.కొన్ని మైనస్ లు ఉన్నా కిరణ్ అబ్బవరం ఖాతాలో హిట్ చేరినట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఫైట్లు, డ్యాన్స్ విషయంలో కిరణ్ అబ్బవరం ఇంకా మెరుగవ్వాల్సి ఉంది.కొన్ని సీన్లలో కిరణ్ అబ్బవరం ఒకే తరహా ఎక్స్ ప్రెషన్లు ఇస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube