విజయవాడలో జరుగుతున్న ఆప్కాబ్ వజ్రోత్సవాలకు సీఎం జగన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఆప్కాబ్ వెన్నుదన్నుగా నిలిచిందన్నారు.
సుమారు 60 ఏళ్ల ప్రయాణంలో ఆప్కాబ్ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వంలో బ్యాంకింగ్ వ్యవస్థ రైతులకు చేరువైందన్న సీఎం జగన్ ఆప్కాబ్ ను నిలబెట్టడంలో దివంగత నేత వైఎస్ఆర్ పాత్ర మరువలేనిదని ఆయన కొనియాడారు.
సహకార వ్యవస్థను వైఎస్ఆర్ బలోపేతం చేశారని తెలిపారు.అయితే వైఎస్ఆర్ మరణం తరువాత ఆప్కాబ్ ఇబ్బందుల్లో పడిందన్న జగన్ 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆప్కాబ్ అభివృద్ధిపై దృష్టి పెట్టామని చెప్పారు.
చట్టాలను మార్చి ఆప్కాబ్ ను బలపరిచామన్నారు.ఈ మేరకు వందల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
రైతు భరోసా కేంద్రాలు రైతులు చేయి పట్టుకొని నడిపిస్తున్నాయని వెల్లడించారు.