విశాఖపట్నంకు చెందిన 2వేలకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తోన్న వేదాంత వీజీసీబీ యొక్క తాగునీటి ప్రాజెక్ట్‌

ఈ తాగునీటి ప్రాజెక్ట్‌లో భాగంగా 4వేల ఎల్‌పీహెచ్‌ ఆర్‌ఓ ప్లాంట్‌ను ఏర్పాటుచేశారు.చుట్టుపక్కల కమ్యూనిటీలకు పరిశుభ్రమైన, సురక్షిత తాగునీటిని అందిస్తుంది 19 మార్చి 2022 : వేదాంత వీజీసీబీ ఇటీవలనే తాగునీటి ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.దీనిద్వారా విశాఖపట్నంలో 2వేల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.తమ సీఎస్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా, వేదాంత యొక్క వీజీసీబీ 4వేల ఎల్‌పీహెచ్‌ సామర్ధ్యం కలిగిన ఆర్‌ఓ ప్లాంట్‌ను ఏర్పాటుచేసింది.

 Vedanta Vgcb's Drinking Water Project Benefiting Over 2,000 Families In Visakhap-TeluguStop.com

ఇది దగ్గరలోని కమ్యూనిటీలకు సురక్షిత మరియు స్వచ్ఛమైన తాగునీటిని నామమాత్రపు ఫీజుతో అందిస్తుంది.గతంలో ఈ ప్రాజెక్ట్‌ను గౌరవనీయ విశాఖపట్నం నగర మేయర్‌ శ్రీమతి గొలగాని హరి వెంకట కుమారి ; 39వ వార్డ్‌ కార్పోరేటర్‌ డాక్టర్‌ మొహమ్మద్‌ సాదిక్‌; 29వవార్డు కార్పోరేటర్‌ శ్రీ వురుకూటి నారాయణ రావు ; వీజీసీబీ డిప్యూటీ సీఈవో శ్రీ సీ సతీష్‌ కుమార్‌ తదితరులు ప్రారంభించారు.

విజయవంతంగా ఈ ప్లాంట్‌ను ఏర్పాటుచేయడంతో పాటుగా కార్యకలాపాలు ప్రారంభించిన తరువాత నిర్వహణ కోసం ఓల్డ్‌ టౌన్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ, విశాఖపట్నంకు అందజేశారు.ఈ ప్రాజెక్ట్‌ను స్వీయ సమృద్ధి నమూనాలో నిర్వహిస్తున్నారు.

ఈ ప్లాంట్‌ నిర్వహణ కోసం నామమాత్రపు ఫీజులను నీటి సరఫరా కోసం కమ్యూనిటీ నుంచి సేకరిస్తారు.వీజీసీబీ ప్రయత్నాలను గౌరవనీయ మేయర్‌ ప్రశంసించడంతో పాటుగా కోవిడ్‌ ఉపశమన కార్యక్రమాలకు మద్దతునందించారు.

వేదాంత లిమిటెడ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ సెక్టార్‌ సీఈఓ సౌవిక్‌ మజుందార్‌ మాట్లాడుతూ ‘నిర్మాణాత్మక సీఎస్‌ఆర్‌ కార్యక్రమాల ద్వారా కమ్యూనిటీల సమగ్ర అభివృద్ధికి మేము తోడ్పడుతున్నాం. మా సీఎస్‌ఆర్‌ కార్యక్రమాలలో ఆరోగ్యం అతి ప్రధానంగా దృష్టికేంద్రీకరించిన అంశమైతే, తాగునీటి ప్రాజెక్ట్‌ ఆ దిశగా వేసిన ఓ ముందడుగు’’ అని అన్నారు ఓల్డ్‌ టౌన్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌ మరియు గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పోరేషన్‌ 39వ వార్డ్‌ కార్పోరేటర్‌ డాక్టర్‌ మొహమ్మద్‌ సాదిక్‌ తాను రాసిన లేఖలో మానవతా ధృక్పథంతో చేపట్టిన వేదాంత కార్యకలాపాలను ప్రశంసించారు.

వేదాంత లిమిటెడ్‌, డిప్యూటీ సీఈవో–వీజీసీబీ సి సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ తమ వ్యాపార సిద్ధాంతంలో అతికీలకమైన అంశంగా సమాజ అభివృద్ధి ఉంటుందన్నారు.ఓల్డ్‌ టౌన్‌ ఏరియాలో ఆర్‌ఓ ప్లాంట్‌ ఏర్పాటుచేయడం ఉపయుక్తంగా ఉందని, ఈ ప్లాంట్‌ ప్రారంభంతో అతి తక్కువ ధరతో సురక్షిత తాగునీరు పొందే అవకాశం తమకు లభించిందని ఈ ప్రాజెక్ట్‌ లబ్ధిదారులలో ఒకరైన ఇస్మాయిల్‌ మొహమ్మద్‌ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube