తిరుమలలో టీటీడీ అధికారులపై ఆగ్రహించిన భక్తులు.. ఏం జరిగిందంటే..

తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిరోజు దేశ నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం వస్తూ ఉంటారు.అలా వచ్చిన కొంతమంది భక్తులు కలియుగ దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో ధర్నాకు దిగారు.

 Devotees Angry With Ttd Officials In Tirumala What Happened , Devotees , Ttd ,-TeluguStop.com

దర్శనానికి అనుమతించకపోవడంతో మ్యూజియం వద్ద శ్రీవారి భక్తులు నిరాశన వ్యక్తం చేశారు.మంగళవారం రోజు శ్రీవారి దేవాలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా శ్రీవారి దర్శనం ఈ 27 తేదీన ఆలస్యంగా ప్రారంభం అయింది.

దేవాలయ శుద్ధి తర్వాత ఉదయం 11 గంటల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులను అనుమతించారు.

కానీ విషయం ముందే తెలియకపోవడంతో సోమవారం రాత్రి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ భక్తులతో పూర్తిగా నిండి ఉంది.

వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వెలుపల ఉన్న భక్తులను క్యూ లైన్ లోనికి టిడిపి సిబ్బంది అనుమతించలేదు.సమాచార లోపం కారణంగా వైకుంఠం క్యూ లైన్స్ వద్దకు చేరుకున్న భక్తులు ఆందోళనకు దిగారు.

దానివల్ల టీటీడీ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.విజిలెన్స్ అధికారులు ఓపికగా చెప్పడంతో భక్తులు శాంతించారు.

శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతుందని దేవాలయ అధికారులు తెలిపారు.సోమవారం రాత్రి క్యూలైన్స్ లోకి భక్తులను అనుమతించడం లేదని టిటిడి విజిలెన్స్ అధికారులు భక్తులకు తెలిపారు.

Telugu Devotees, Devotional, Koilalwar, Tirumala, Ttd Eo, Ttdvigilance-Latest Ne

తిరుమలలోని టీటీడీ అధికారులతో కలిసి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను ఈవో అనిల్ కుమార్ సింగల్ పరిశీలించారు.అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.ఆ తర్వాత ఈవో అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు పది రోజుల పాటు ఉంటుందని చెప్పారు.ఇందుకోసం ఆన్లైన్లో 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు రెండు లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు.

జనవరి ఒకటవ తేదీన ఆఫ్లైన్ విధానంలో తిరుపతిలో టీటీడీ టోకెన్లను కేటాయించే అవకాశం ఉంది.తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల ద్వారా రోజుకు 50 వేల చొప్పున 5 లక్షల టికెట్లను టిటిడి కేటాయిస్తుంది.

అంతేకాకుండా వైకుంఠ ద్వార దర్శనం జరిగే 10 రోజులు సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తామని టిటిడి అధికారులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube