మన ఇంటి చుట్టూ కనిపించే అనేక రకాల మొక్కలు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి.వాటిలో దుంపలు, వేర్లు, తీగలు కూడా భాగమే.
వీటిని ఉపయోగించే మన ఆయుర్వేద వైద్యులు కూడా చికిత్స చేసేవారు.అలా ఎన్నో రకాలుగా ఉపయోగపడే మనకు ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే వాటిలో తిప్పతీగ కూడా ఒకటి.
ఆయుర్వేదంలో దీని విశిష్టత చాలా ప్రముఖమైనది.అనేక రకాల ఔషధాలు మందుల తయారీలో ఉపయోగించే తిప్పతీగ తో చాలా ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి.
తిప్పతీగలు అనేక అద్భుతమైన ఔషధ గుణాలు ఉండడమే ఇందుకు కారణమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.ఈ క్రమంలో తిప్పతీగ వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లూ, వైరల్ జ్వరాలు వచ్చినప్పుడు తిప్పతీగను తీసుకుంటే వెంటనే తగ్గిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.తిప్పతీగ శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఫలితంగా జ్వరం త్వరగా తగ్గిపోతుంది.
ఆల్కలాయిడ్లు, లాక్టేన్లు అనే బయో ఆక్టివ్ సమ్మేళనాలు ఉండడం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడానికి తిప్పతీగ ఎంతగానో ఉపయోగపడుతుంది.
అంతేకాకుండా శరీరంలోని వ్యర్ధాలను బయటికి పంపించి, రక్తంలోని షుగర్ స్థాయిని తగ్గిస్తుంది.కీళ్లు వాపు రావాడం వల్ల ఆర్థరైటి సమస్య వస్తుంది.
అయితే తిప్పతీగ కీళ్ల వాపును తగ్గిస్తుంది.ఈ క్రమంలో ఆర్థరైటిస్ ఉన్నవారికి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

తిప్పతీగ రసం జలుబు దగ్గు లాంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.తిప్పతీగలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తాయి.ఆయుర్వేదం ప్రకారం తిప్పతీగ ఈ సమస్యల పరిష్కారంలో అద్భుతంగా పనిచేయడమే కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

ప్రస్తుత కాలంలో అవలంబిస్తున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల వల్ల చాలామందికి జీర్ణ సమస్యలు వస్తున్నాయి.అలాంటివారు తిప్పతీగను ప్రతిరోజు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యను దూరం చేస్తుంది.తిప్పతీగ మన శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తి స్థాయి పెరిగేలా చేస్తుంది.
దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.