పురాణాలే కమర్షియల్ ముడి సరుకుగా ప్రస్తుతం వస్తున్న సినిమాలు !

సినిమా అంటేనే ఎంతో ప్రభావితమైన ఒక మాధ్యమం.సినిమాను చూసి చాలా ఎక్కువగా ప్రభావితం అయ్యే వారు ఉంటారు.

 Tollywood Industry Present Movies Adipurush Kalki Hanuman Rrr Details, Tollywood-TeluguStop.com

కొన్ని విషయాల్లో మంచిని తీసుకుంటే మరికొన్ని విషయాల్లో అందులో వస్తున్న చెడుని తీసుకుంటున్నారు.ప్రతి ఒక్కరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి.

కానీ చెడును మాత్రమే తీసుకునేవారు లేకపోలేదు.ఇటీవల కాలంలో వచ్చిన ఆనిమల్ సినిమా చూసి పాడైపోయిన వారు లేరు అంటారా ? ఖచ్చితంగా ఆ సినిమా వల్ల సమాజానికి మంచి కన్నా చెడే ఎక్కువగా అర్థమయింది.ఇక మరోవైపు పురాణాలనే ముడి సరుకుగా తీసుకొని చాలా సినిమాలు వస్తున్నాయి.అందులో టాలీవుడ్ ముందు వరుసలో ఉంది.

Telugu Adipurush, Hanuman, Kalki, Mahabharatam, Mythological, Puranas, Rajamouli

ఇలా పురాణాలను వాడుకొని పాత్రలను లిబర్టీతో రాసుకునే వారిలో మన టాలీవుడ్ జక్కన్న ముందు వరుసలో ఉంటారు అలాగే ఆయన త్రిబుల్ ఆర్ సినిమాలో( RRR ) పురాణాలు అని చెప్పలేను కానీ అల్లూరి సీతారామరాజు, బీమ్ అనే స్వాతంత్ర సమరయోధుల పాత్రలను తీసుకొని తన లిబర్టీ తో సినిమా చూపించారు.ఇక సంక్రాంతి కానుకగా మనందరికీ హనుమాన్ సినిమా( Hanuman Movie ) వచ్చిన సంగతి తెలిసిందే ఈ సినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.ఇందులో హనుమాన్ పాత్ర పూర్తిస్థాయిలో దర్శకుడు లిబర్టీతో ముందుకు వెళ్ళింది.ఇక ఇప్పుడు రామాయణం ట్రెండ్ కూడా బాగా నడుస్తోంది.ఇప్పటికే ఓం రౌత్ ప్రభాస్ హీరోగా ఆది పురుష్( Adipurush ) తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే.ఆ సినిమా డిజాస్టర్ అయినా కూడా ప్రభాస్ మరోసారి నమ్మి పురాణాల పాత్రలపై ఫోకస్ చేశారు.

అందుకే ఇప్పుడు ప్రేక్షకుల ముందు కల్కి( Kalki ) అనే ఒక అద్భుతం ఆవిష్కరించబడింది.

Telugu Adipurush, Hanuman, Kalki, Mahabharatam, Mythological, Puranas, Rajamouli

ఈ సినిమాలోని పాత్రల తీరుతెన్ను ఎంతో అద్భుతంగా ప్రేక్షకులు కనెక్ట్ చేసుకున్నారు.మహాభారతాన్ని ఎక్కువగా ఆయన ఫోకస్ చేశారు.గతంలో రాజమౌళి సైతం మహాభారతం చాలా ఎమోషన్స్ తో కూడుకున్న డ్రమటిక్ పాత్రలకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్పారు.

అనుకున్నట్టుగానే ఆయన ఫ్యూచర్లో మహాభారతాన్ని తెరకెక్కిస్తారట.అలాగే నార్త్ తో మరొక రామాయణం( Ramayanam ) తెరకెక్కుతుంది.

ఇందులో రణబీర్ కపూర్ సాయి పల్లవి నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.వీటివల్ల దేవుళ్లపై నమ్మకం పురాణాలపై విశ్వాసం ప్రేక్షకులలో ఏర్పడి ఈతరం వారికి భక్తి పెరుగుతుంది అని చాలామంది నమ్ముతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube