మునుగోడులో బీసి గోడు వినేపార్టీలు ఏవి?

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1967లో మునుగోడు నియోజకవర్గం ఏర్పడింది.మొత్తం 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్ ఎనిమిది సార్లు, సిపిఐ ఆరుసార్లు, ఇతరులు ఒకసారి, టిఆర్ఎస్ ఒకసారి విజయం సాధించాయి.

 Which Political Party Can Solve Bc Social Category Issues In Munugode Constituen-TeluguStop.com

ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఉజ్జిని నారాయణరావు, పల్లా వెంకటరెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు నియోజకవర్గాన్ని ఏర్పడిన నాటి ఉండి నేటి వరకు అగ్రకుల నాయకులే నియోజకవర్గాన్ని ఏలుతూ వస్తున్నటువంటి సందర్భం.మునుగోడు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 2,27,101 మంది ఓటర్లు, నియోజకవర్గంలో 70% బీసీ సామాజిక వర్గం ఓట్లే, ఎస్సీ, ఎస్టీలను కలుపుకుంటే 90 శాతం బలహీనవర్గాల ఓట్లే.

కానీ గతం నుండి ప్రధాన రాజకీయ పార్టీలు మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు ఇవ్వడం మర్చిపోయాయి.వారిపై నేటికీ అగ్రకుల నాయకులే పెత్తనం చిలాయిస్తూనే ఉన్నారు.

ఈసారి మా బహుజనులు చైతన్య పడ్డారు.ప్రధాన రాజకీయ పార్టీల్లో బిసిలు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని బల్లగుద్ది మరి చెబుతున్నారు.

మునుగోడు ఉప ఎన్నికల బిజెపి తరఫున రాజగోపాల్ రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్టే, తెలంగాణలో బడపడాలని, రాష్ట్రంలో అధికారం చేజించుకోవాలని బిజెపి చేయ్యని ప్రయత్నం లేదు.రాష్ట్రంలో గతంలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో గెలిచిన బిజెపి, ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో గెలిచి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం మాదే అని ప్రచారం చేసుకునే పనిలో ఉంది.

రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు మునుగోడు గెలుపు చాలా అవసరం.అయితే బిజెపి మునుగోడులో పెద్దగా లేనప్పటికీ, 2018లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన గంగిడి మనోహర్ రెడ్డికి 12,725 ఓట్లు వచ్చాయి.

నాటికి నేటికి కొంత పరిస్థితులు మారాయి కాబట్టి అందులో రాజగోపాల్ రెడ్డి ఇతర పార్టీల నేతలకు గాలం వేసి వాళ్లకు అన్ని రకాల వనరులు సమకూర్చి పార్టీలో చేర్చుకుంటు న్నాడు, కాబట్టి అభ్యర్థి మార్పు జరిగింది కాబట్టి గతంలో కంటే కొంత ఓట్ల శాతం పెరిగే అవకాశంమే తప్ప గెలవడం మాత్రం బిజెపికి సాధ్యపడదని బలంగా చెప్పవచ్చు.

Telugu Bc Category, Congress, Karne Prabhakar, Rajagopal Reddy-Political

మునుగోడు నియోజకవర్గంలో వామపక్ష భావజాలం ఎక్కువ, కమ్యూనిస్టు పార్టీలు బిజెపికి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వరన్న విషయమైతె స్పష్టమే, అయితే ఇంకోటి బిజెపి అంటే దళితుల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదన్న మాట వాస్తవమే, అయితే కమ్యూనిస్టు పార్టీల ఓట్లు, ఎస్సీ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో బిజెపికి పడే అవకాశమే లేదు.కాంగ్రెస్ విషయానికొస్తే నియోజకవర్గంలో కొంత బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ రాజగోపాల్ రెడ్డి తో దాదాపు కొంత వెళ్తున్నారు.కాంగ్రెస్ లో అన్ని లుసుగులే, అభ్యర్థి ఎంపికపై స్పష్టత ఇప్పటివరకు లేదు, కార్యకర్తలకు భరోసానిచ్చే నాయకుడు మునుగోడులో లేడు, కాంగ్రెస్ పార్టీలో కూడా అభ్యర్థిగా అగ్రకుల నాయకుల పేర్లే చల్లమల్ల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి పేర్లే బలంగా వినిపిస్తున్నాయి.

కాబట్టి కాంగ్రెస్ పార్టీని కూడా నియోజకవర్గ ప్రజలు విశ్వసించారనేది కొంత సమాచారమైతె ఉంది.ఇప్పుడు మునుగోడు మొత్తం ‘బీసీ’ వాదం వినిపిస్తుంది.మునుగోడు ఉపఎన్నిక పోరులో రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి మాటేమిటంటే కాంగ్రెస్ మూడో స్థానమే అని అంటున్నారు.ఇగ టీఆర్ఎస్ విషయానికొస్తే 2014, 2018లో అగ్రకులాలకే అవకాశం ఇచ్చింది.

Telugu Bc Category, Congress, Karne Prabhakar, Rajagopal Reddy-Political

మొదటిసారి గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పై, 2014 నుండి 2018 వరకు తను కార్యకర్తలతో,అధికారులతో వ్యవహరించిన వ్యవహార శైలి, ఇతరితర పనులన్నిటిలోనూ తల దూర్చేవాడని, తమ సామాజిక వర్గం వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని, బీసీ, ఎస్సీ ,ఎస్టీల్లో వ్యతిరేకత వచ్చింది.ముఖ్యంగా గతంలో తన అనుచరులుగా చలామణి అయిన వారందరూ, ప్రజా ప్రతినిధులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలి నచ్చకపోవడమే 2018లో ఓటమికి కారణమని అనేక సర్వేల్లో వెళ్లడైంది.ఈసారి టిఆర్ఎస్ పార్టీ మునుగోడు అభ్యర్థిత్వంపై అధిష్టానం కొంత ఆలోచన చేస్తే బాగుంటుందని కార్యకర్తల మాట, బిజెపిని మునుగోడు లో ఓడించి తీరాలంటే టిఆర్ఎస్ అధిష్టానం బీసీ వాదానికి ఈసారి అవకాశం ఇస్తే, అగ్రకుల నాయకులపై బీసీ అభ్యర్థి గెలిచే అవకాశం లేకపోలేదు.మునుగోడు లో టిఆర్ఎస్ పార్టీ మళ్లీ అగ్రకులాలకే అవకాశం ఇస్తే మాత్రం గెలుపోటముల్లో తేడాలు రావచ్చు.

నియోజకవర్గంలో బహుజనులు బిజెపిని ఓడించాలని కంకణం కట్టుకొని కూర్చున్నారు.కానీ బిజెపిని ఓడించే సత్తా ఉన్న పార్టీ టిఆర్ఎస్సే కాబట్టి బీసీ అభ్యర్థికి అవకాశం ఇస్తే ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, అగ్రకుల పేదలను కలుపుకొని మునుగోడులో కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా ఎగురవేసే అవకాశం ఉంది.

Telugu Bc Category, Congress, Karne Prabhakar, Rajagopal Reddy-Political

మునుగోడు నియోజకవర్గంలో బీసీ నాయకుల్లో గట్టి పట్టున్న నేత కర్నె ప్రభాకర్, అన్ని పార్టీల వారు అభిమానించే నాయకుడు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుడు, టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, నియోజకవర్గ బిడ్డ స్థానికుడు, తన సతీమణి పద్మశాలి సామాజిక వర్గానికి చెందినమే, టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలతో పాటు ‘బీసీ’ వాదం జత కడితే టిఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే.టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం కర్నె ప్రభాకర్ పేరు పరిశీలన చేస్తున్నట్టు సమాచారమైతె ఉంది, అవకాశం ఇస్తే మాత్రం గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.చూడాలి మరి ఎవరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తుందో టిఆర్ఎస్.అందరి చూపు టిఆర్ఎస్ అభ్యర్థి వైపే.అభ్యర్థి ఎంపికతో గెలుపోటములు కొంత బెరిజు చేసుకోవచ్చని మేధావులు, రాజకీయ విశ్లేషకులు అంటున్నటువంటి మాట, ఏది ఏమైనప్పటికీ మునుగోడు నియోజకవర్గంలోని బీసీల్లో మాత్రం చైతన్యం వచ్చింది.మన ఓట్లు మన సీటు మునుగోడు అని బహిరంగానంగానే అంటున్నారు.

చూడాలి మరి బీసీ నాయకులకు ప్రధాన రాజకీయ పార్టీల నుంచి టికెట్లు తెచ్చుకునే వీలుందో… లేదా ఎప్పటిలా వాళ్ళ కింద పనిచేయడామో.వేచి చూడాలి మును ‘బీసీ’గోడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube