ఎన్నికల సీజన్ మొదలైంది అంటే చాలు … ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి వలసలు అనేవి సర్వసాధారణంగా మారిపోతుంటాయి.ఇతర పార్టీల్లోని కీలక నాయకులకు అనేక ఆఫర్లు ఇచ్చి మరి పార్టీలు చేర్చుకుంటాయి.
ఇదంతా ఎప్పుడూ జరిగే తంతే.అయితే దీనికి భిన్నంగా రాజకీయ వ్యూహకర్త లు కూడా ఈ మధ్యకాలంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి వ్యూహాలు అందించేందుకు ఒప్పందలు చేసుకుంటుండడం చర్చనీయంశం గా మారింది .ముఖ్యంగా ఏపీ అధికార పార్టీకి రాజకీయ వ్యూహాలు అందిస్తున్న ఓ కీలక వ్యక్తి ఇప్పుడు టిడిపితో ఒప్పందం చేసుకోవడం పై వైసిపి టెన్షన్ పడుతోంది.
వైసిపి కోసం ఐ ప్యాక్ టీం లో పనిచేస్తున్న కీలక వ్యక్తి ఇప్పుడు టిడిపికి వ్యవహకర్తగా ఉన్న రాబిన్ శర్మ టీం లో డైరెక్టర్ హోదాలో చేరిపోయారు.
ఏపీలో మళ్లీ వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఐ ప్యాక్ టీం పనిచేస్తుంది.దీనిలో కీలక సభ్యుడిగా ఉన్న శాంతన్ సింగ్ ఇప్పుడు తెలుగుదేశం కి వ్యూహాలు అందించేందుకు రాబిన్ శర్మ షో టైం కన్సల్టింగ్ బృందంలో చేరారు.ఐ ప్యాక్ టీం లో కీలక మెంబర్ గా పనిచేసిన శాంతన్ టిడిపి పోల్ వర్కౌట్ కోసం నియమించుకుంది .2024 ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వ్యూహాలు అమలు చేసే బాధ్యతను రాబిన్ శర్మ షో టైం కన్సల్టింగ్ చూడబోతోంది.ఐఐటి కాన్పూర్ విద్యార్ధి అయిన ఐపాక్ టీంలో కీలకంగా పనిచేస్తున్న రుషిరాజ్ సింగ్ కు సన్నిహితుడు .ఎస్ డి సీ లో చేరకముందు ఐ ప్యాక్ లో పొలిటికల్ వింగ్ ను చూశారు.

2019 ఎన్నికల సమయంలో వైసీపీ కోసం పనిచేశారు.ఇప్పుడు టిడిపి కి వ్యూహాలు అందించే బృందంలో చేరిపోయారు.అయితే ఆయన ఎక్కువ కాలం వైసిపి కోసం పనిచేసి ఉండడంతో వైసీపీకి సంబంధించిన అన్ని బలాలు, బలహీనతలు సొంతం కు తెలిసి ఉంటాయని ఉద్దేశంతో ఆయనకు టిడిపి ఆహ్వానం పంపిస్తున్నట్లు సమాచారం.రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న టిడిపి తమకు అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా కీలక వ్యక్తులందరినీ తమ పార్టీకి పనిచేసే విధంగా ఒప్పందాలు చేసుకుంటోంది.