ఆ విషయంలో కైకాలకు అన్యాయం జరిగిందా.. వాళ్ల రాజకీయాల వల్లేనా?

ఈ మధ్య కాలంలో సినిమా రంగంలో వరుసగా చోటు చేసుకుంటున్న విషాదాలు అభిమానులకు షాకిస్తున్నాయి. కైకాల సత్యనారాయణ మరణించారనే వార్తను ఆయన అభిమానులలో చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు.

 Shocking Facts About Kaikala Satyanarayana Cine Career Details Here Goes Viral,-TeluguStop.com

అయితే కైకాల సత్యనారాయణకు రావాల్సిన స్థాయిలో గుర్తింపు రాలేదని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం.అవార్డుల విషయంలో ప్రభుత్వాలు కైకాలపై చిన్న చూపు చూశాయని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

కైకాల సత్యనారాయణకు పద్మ పురస్కారం దక్కి ఉంటే బాగుండేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.అవార్డులు అర్హతల ఆధారంగా కాకుండా మరో విధంగా ఇస్తున్నారని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.కొంతమంది రాజకీయాల వల్లే కైకాలకు అవార్డులు రాలేదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.60 సంవత్సరాల పాటు సినిమా రంగం కోసం కైకాల సత్యనారాయణ ఎంతో కృషి చేశారు.

అన్ని పురస్కారాలకు కైకాల సత్యనారాయణ అర్హుడని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కెరీర్ తొలినాళ్లలో సత్యనారాయణ 15 రోజుల పాటు పార్కులో పడుకున్న సందర్భాలు ఉన్నాయి.

దుర్యోధనుడి పాత్ర చేయాలనేది సత్యనారాయణ కోరిక కాగా కృష్ణావతారం సినిమాతో ఆ కోరిక తీరింది.యమదొంగ సినిమాలో కూడా సత్యనారాయణకే యముడి రోల్ అవకాశం వచ్చినా కొన్ని రీజన్స్ వల్ల ఆయన చేయలేదు.

మారిన పరిస్థితుల వల్లే ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు.ఈతరం హీరోలు కాసుల కోసం చూసుకుంటున్నారని కైకాల సత్యనారాయణ ఒక సందర్భంలో అన్నారు.హీరోల ప్రవర్తన నచ్చక కైకాల సత్యనారాయణ సినిమాలకు దూరంగా ఉంటున్నానని ఒక సందర్భంలో తెలిపారు.కైకాలతో అనుబంధాన్ని తలచుకుంటూ చాలామంది సినీ సెలబ్రిటీలు శోకసంద్రంలో మునిగిపోయారు.కైకాల మరణం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు తీరని లోటు అని నెటిజన్ల నుంచి సైతం కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube