వారెవ్వా: మృత్యువు కళ్ళముందున్నా చాకచక్యంతో బయటపడిన 11 ఏళ్ళ చిన్నారి!

అదొక చదువుల దేవాలయం.ప్రశాంతమైన వాతావరణంలో టీచర్లు చెప్పే పాఠాలు విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారు.

 11 Years Old Girl Pretends As Dead To Save Herself From Texas School Shoot Detai-TeluguStop.com

ఇంతలో ఊహించని పరిణామం.సడెన్ గా అక్కడికి ఓ వ్యక్తి తుపాకీతో వచ్చి అక్కడున్న విద్యార్థులను, టీచర్లపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.

విద్యార్థులు దుండగుడి తుపాకీ నుంచి వచ్చిన తూటాలకు ఒక్కొక్కరు బలైపోతున్నారు.ఇంతలో 11ఏళ్ల మియా వంతు రానేవచ్చింది.

సరిగ్గా అదేసమయంలో ఆమెకి అద్భుత ఆలోచన తట్టింది.ఆ ఆలోచనే మియా సెర్రిల్లోను ప్రాణాలతో బయటపడేసింది.

ఈ ఘటన గత 3 రోజుల క్రితం అమెరికాలోని టెక్సాస్ స్కూల్ లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో చోటు చేసుకుంది.

దుర్మార్గుడు జరిపిన కాల్పుల్లో 19మంది విద్యార్థులతో సహా మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం.

వివరాల్లోకి వెళితే, మియా సెర్రిల్లో ఎలిమెంటరీ స్కూల్ లో 4వ తరగతి చదువుతోంది.రోజులాగే గత మంగళవారం కూడా పాఠశాలకు వెళ్లింది.క్లాస్ రూములో టీచర్లు చెప్పే పాఠాలు వింటోంది.ఇంతలో హఠాత్తుగా ఓ గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో వచ్చి అందరినీ విచక్షణారహితంగా కాల్చేస్తున్నాడు.

మియా చుట్టుపక్కన ఉన్న ఫ్రెండ్స్ తుపాకీ తూటాలకు ఒక్కొక్కరుగా బలైపోతున్నారు.పాఠాలు చెప్పే టీచర్ సైతం దుండగుడి తూటాకు బయలైంది.

Telugu America, Mia Cerillo, Pretends, School, Meida, Texas School, Latest-Lates

ఆ దుండగుడు ఇపుడు మియా వైపు వస్తున్నాడు.ఇక ఇదే నాకు ఆఖరి రోజు అనుకొని, మనసులో దేవుణ్ణి ప్రార్ధించింది మియా.ఇంతలో మియాకు అద్భుత ఆలోచన తట్టింది.వెంటనే పక్కనే స్నేహితల మృతదేహాల నుంచి కారుతున్న రక్తాన్ని చేతులకు పూసుకొని తన వంటికి రాసుకుంది.అనంతరం రక్తపు మడుగులో పడుకొని శవంలా నటించింది.దాంతో మియా కూడా చనిపోయిందని నిర్దారించుకున్న దుండగుడు అక్కడి నుంచి వెళ్లిపోవటంతో మియా ఊపిరి పీల్చుకుంది.

దుండగుడు వెళ్లిపోయిన వెంటనే పక్కనే చనిపోయిన టీచర్ చేతిలో ఉన్న ఫోన్ ను తీసుకొని 911 నెంబర్ కు ఫోన్ చేసింది.అయితే ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన మియాకి ఇంకా గతం తాలూక జ్ఞాపకాలు వెంటాడుతున్నాయని ఆమె తల్లి దండ్రులు వాపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube