మంచు మనోజ్ రెండో పెళ్లి విషయంలో సైలెంట్ గా ఉండటానికి కారణమిదేనా?

మంచు మనోజ్ భూమా మౌనికల పెళ్లి గ్రాండ్ గా ఫిబ్రవరి నెల 2వ తేదీన జరగనుందని వార్తలు జోరుగా గత నెలలో ప్రచారంలోకి వచ్చాయి.అయితే ఫిబ్రవరి 2వ తేదీ ముగిసినా మనోజ్ పెళ్లి జరిగినట్టు ఎక్కడా వార్తలు రాలేదు.

 Confusion About Manchu Manoj Second Marriage With Bhuma Mounika Reddy Details, M-TeluguStop.com

కొన్నిరోజుల క్రితం కొత్త సినిమాను ప్రకటించిన మంచు మనోజ్ తన పెళ్లి గురించి మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.ప్రస్తుతం మనోజ్ సైలెంట్ గానే ఉన్నారు.

కుటుంబ సమస్యల వల్లే మనోజ్ మౌనికల పెళ్లి వాయిదా పడిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.మనోజ్ మౌనికల పెళ్లి జరగనుందని వీళ్లిద్దరి పెళ్లి జరగడానికి మరి కొంత సమయం మాత్రం పడుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మంచు మనోజ్ గతంలో ఓకే చెప్పిన అహం బ్రహ్మస్మి సినిమా ఎప్పుడు పూర్తవుతుందో ఈ సినిమా ఎప్పటికి థియేటర్లలో విడుదలవుతుందో స్పష్టత రావాల్సి ఉంది.

Telugu Aham Brahmasmi, Bhumamounika, Manchu Manoj, Manchumanoj, Tollywood-Movie

మనోజ్ రెండో పెళ్లికి సంబంధించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.మనోజ్ రేంజ్ అంతకంతకూ పెరగాలని ఇకపై మనోజ్ ప్రాజెక్ట్ లన్నీ సక్సెస్ సాధించాలని అభిమానులు భావిస్తున్నారు.మంచు ఫ్యామిలీపై ప్రేక్షకుల్లో నెగిటివిటీ ఉన్నా మంచు మనోజ్ మాత్రం ఈ విషయంలో మినహాయింపును కలిగి ఉన్నారు.

Telugu Aham Brahmasmi, Bhumamounika, Manchu Manoj, Manchumanoj, Tollywood-Movie

మంచు మనోజ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 4 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది.సొంత బ్యానర్లలో నటించడానికి మంచు మనోజ్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.రీమేక్ సినిమాలపై మంచు మనోజ్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మనోజ్ క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్ లలో నటించాలని స్టార్ దర్శకుల డైరెక్షన్ లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మనోజ్ నటుడిగా తన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచే ప్రాజెక్ట్ లలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube