మెంతులు.( Fenugreek Seeds ) వీటి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.దాదాపు ప్రతి ఒక్కరి వంటింట్లో మెంతులు ఖచ్చితంగా ఉంటాయి.రుచి చేదుగా ఉన్న మెంతుల్లో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్యపరంగా మెంతులు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.అలాగే చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి కూడా మెంతులు ఉపయోగపడతాయి.
ముఖ్యంగా మొటిమలు,( Pimples ) వాటి తాలూకు మచ్చలను మాయం చేయడానికి మెంతులు అద్భుతంగా సహాయపడతాయి.మరి అందుకోసం మెంతులను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు మెంతులు వేసి స్మూత్ పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతుల పొడిని వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్,( Orange Peel Powder ) హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకోవాలి.చివరిగా సరిపడా రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే మొండి మొటిమలు, వాటి తాలూకు మచ్చలు క్రమంగా మాయం అవుతాయి.పిగ్మెంటేషన్ సమస్య నుంచి బయటపడటానికి కూడా ఈ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.

అలాగే తరచూ ఈ ప్యాక్ ను వేసుకోవడం వల్ల చర్మ ఛాయ మెరుగుపడుతుంది.డెడ్ స్కిన్ సెల్స్, బ్లాక్ హెడ్స్ వంటివి తొలగిపోతాయి.స్కిన్ యవ్వనంగా కాంతివంతంగా మెరుస్తుంది.క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.ముడతలు సైతం త్వరగా దరిచేరకుండా ఉంటాయి.ఎలాంటి మొటిమ మచ్చలు లేకుండా ముఖం అందంగా మెరిసిపోవాలని కోరుకునేవారు తప్పకుండా మెంతులతో పైన చెప్పిన రెమెడీని పాటించండి.