ఆరు పదుల వయసులో అరభిక్ పాటకు అదిరేలా స్టెప్పులేసిన బామ్మ...

ఇది సోషల్ మీడియా యుగం చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో వైరల్ అవుతున్న నేపథ్యం.సినిమా పాటలు రిలీజ్ కాకపోయినా ఆ పాటలకు అదిరిపోయే డాన్స్ లు వేసి అందరి చూపు తమ వైపు తిప్పుకునేలా చేసుకుంటారు నెటిజన్లు.

 Grandmother Who Stepped Arabic Song At The Age Of 60 Viral Video Details, Arabic-TeluguStop.com

వాళ్లు వేసిన స్టెప్పులను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.దీంతో క్షణాల్లో లక్షలమంది ఆ వీడియోను చూడడం లైక్స్, షేర్స్ చేయడం వల్లా అనుకున్న దానికంటే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి వీడియోలు.

గత నెల నుండి అరభిక్ సాంగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా ఆ పాటకు 60 ఏళ్ళ బామ్మ అదిరిపోయే స్టెప్పులేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ పాటను ఇప్పటికే 10 కోట్ల 95 లక్షల మంది వీక్షించడం విశేషం.కేవలం నెలకు ముందే ఈ సాంగ్ విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

తాజాగా బామ్మ వైరల్ అయింది.ప్రస్తుతం నెట్టింట్లో అందరు ఆమె గురించే చర్చించుకుంటున్నారు.

ఈ వయసులో బామ్మ వేసిన స్టెప్పులు కాకుండా పాటకున్న క్రేజ్ ఆమెతో డాన్స్ వేయించిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ఇప్పటికే స్టార్ హీరోయిన్స్ సమంత, రష్మిక, కీర్తి సురేష్, వేదిక, పూర్ణ, రితికా సింగ్ లు ఈ అరభిక్ సాంగ్ కు డాన్స్ వేసి అలరించారు.

కొత్త ట్రేండింగ్ పాటలు వస్తే టక్కున ఆ పాటలకు డాన్స్ వేసి సోషల్ మీడియాలో హల్ చల్ కావడం ఈ హీరోయిన్స్ కు ముందునుండే అలవాటు.సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉండడం వారి నైజం.

ఇక ఇన్స్టాగ్రామ్ లో అయితే వేల సంఖ్యలో అమ్మాయిలు ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు.ప్రతీరోజు ఏదో ఒక పాటతో ఫేమస్ అవుతూనే వున్నారు.కిందటి వారంలో బ్లాక్ షార్ట్ వేసుకుని అరభిక్ సాంగ్ కు ఒక అమ్మాయి డాన్స్ వేసిన విషయం తెలిసిందే.ఆమె మీద కొద్దిమంది నెగిటీవ్ గాను, మరికొందరు పాజిటీవ్ గాను కామెంట్లు చేశారు.

అయితే ఎన్ని కామెంట్లు వచ్చినా ఈ సోషల్ మీడియా యుగంలో యువకులు ట్రెండింగ్ మాత్రం వదలడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube