ఏపీ సీఎం జగన్ ను నియంతగా పేరుగాంచిన నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ తో పోల్చడం సరికాదని సీపీఐ నారాయణ అన్నారు.జగన్‌ను కిమ్‌తో పోలుస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ.జగన్‌కు, కిమ్‌కు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు.
అమెరికా లాంటి అగ్రదేశాన్ని గడగడలాడించిన కిమ్ ను ఇలా పోల్చడం సరికాదని వ్యాఖ్యనించారు.అనంతరం హత్యా రాజకీయాలను వైసీపీ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.







