తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికే అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతూనే ఉంది తమన్నా.
కాగా ఈ ముద్దుగుమ్మ కి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.ఇక తమన్నా మూడు పదుల వయస్సు దాటుతున్న కూడా ఇంకా పెళ్లి చేసుకోకపోవడం పై అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా తమన్నా ఎక్కడికి వెళ్లినా కూడా ఆమెకు పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో తమన్నా పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమన్నా త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే గతంలో తమన్నా పెళ్లికి సంబంధించిన వార్తలు వినిపించినప్పుడు ఆమె ఆ వార్తలను ఖండిస్తూ తనకు ఇంకా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని చెప్పడంతో ఆ వార్తలకు పులిస్టాప్ పెట్టేసినట్టు అయింది.
కానీ తాజాగా తమన్నా తన పెళ్లికి సంబంధించిన వార్తలు వినిపించినప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో ఆ వార్తల్లో నిజం ఉంది అని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

కాగా తమన్నా ముంబైకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకోబోతోంది అని తెలుస్తోంది.అయితే తమన్నా తన పెళ్లి నిర్ణయాన్ని తన తల్లిదండ్రులకే వదిలేసినట్టుగా ఇప్పటికే గతంలో పలు సార్లు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.అయితే ఈ ముంబై బిజినెస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధమే అని తెలుస్తోంది.
మొత్తానికి ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ తో మన మిల్కీ బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కనుందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.మరి ఈ వార్తల్లో నిజా నిజాల గురించి తెలియాలి అంటే తమన్నా స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.







