రష్యా మరియు ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.ఉక్రెయిన్ లో ప్రధాన నగరాలలో విద్యుత్ కేంద్రాలపై రష్యా దాడులకు పాల్పడటంతో చాలా నగరాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి.
పరిస్థితీ ఇలా ఉంటే ఉక్రెయిన్.పొరుగు దేశం పోలాండ్ లో ఓ చిన్న గ్రామంపై మంగళవారం రాత్రి క్షిపణితో దాడి చేయడం జరిగింది.
జరిగిన ఈ దాడిలో ఇద్దరు గ్రామస్తులు చనిపోయారు.ఉక్రెయిన్ సరిహద్దులకు దూరంలో ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఈ గ్రామంలో జరిగిన దాడితో నాటో దేశాలు అప్రమత్తమయ్యాయి.
ప్రస్తుతం ఇండోనేషియాలో జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సదస్సు జరుగుతున్న సమయంలోనే.
ఉక్రెయిన్ పై క్షిపణిలతో విరుచుకుపడుతున్న రష్యా పోలాండ్ పై కూడా దాడి చేసినట్లు.వార్తలు వస్తున్నాయి.

విషయంలోకి వెళ్తే మంగళవారం పోలాండ్ విదేశాంగ శాఖ మంత్రి.ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది.తమ దేశానికి చెందిన గ్రామం పై క్షిపణి దాడి చేయడంతో ఇద్దరు మరణించినట్లు తెలియజేశారు.అంతేకాదు ఆ క్షిపణి రష్యాలో తయారయిందని తమ వద్ద ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.
మరి ఆ క్షిపణినీ తమ పైకి ఏ దేశం ప్రయోగించిందో స్పష్టత లేదని పోలాండ్ ప్రెసిడెంట్ ఆండ్రేజెజ్ పేర్కొన్నారు.అయితే ఈ దాడిపై.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సీరియస్ అయ్యారు.ఇదే సమయంలో జీ7 నాటో దేశాల నేతలను అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు.జీ20 సమావేశాల అనంతరం.ఫ్రాన్స్, కెనడా, యూకే, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, నెదర్లాండ్స్ దేశాల నేతలతో సమావేశం అవటానికి జో బైడెన్ రెడీ అవుతున్నారు.







