కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ఆయన దర్శకత్వంలోనే నటించిన తాజా చిత్రం కాంతార. ఈ సినిమా అన్ని భాషలలో విడుదలై ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసింది.
ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద వందల కోట్ల కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా భూతకోల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ విధంగా ఆదివాసిల సంస్కృతి సాంప్రదాయాలను కళ్లకు కట్టినట్టు రిషబ్ శెట్టి చూపించారు.
లేకపోతే ఈ సినిమాలో నటి నటులు వేసిన దుస్తుల సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సినిమాని కనక చూస్తే అప్పటి కాలంలో పాత్రలను ప్రతిబింబించేలా దుస్తులను డిజైన్ చేశారు.
ఈ విధంగా కాంతర సినిమాలో నటీనటుల కోసం ప్రత్యేకంగా ఈ దుస్తులను డిజైన్ చేశారు.అయితే ఈ దుస్తులను డిజైన్ చేసినది ఎవరు.ఈ సినిమా కోసం ఎన్ని కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు అనే విషయాన్ని వస్తే.ఈ సినిమాకి డిజైనర్ గా వ్యవహరించినది మరెవరో కాదు హీరో కం డైరెక్టర్ రిషబ్ శెట్టి భార్య ప్రగతి శెట్టి ఈ సినిమాకు డిజైనర్ గా వ్యవహరించారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ప్రగతి శెట్టి ఈ సినిమాలో నటీనటుల దుస్తుల గురించి పలు విషయాలను వెల్లడించారు.
ఈ సినిమాలో దుస్తుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపారు.ఈ సినిమాలో నటీనటుల కోసం సుమారు 1000 డ్రస్సులను డిజైన్ చేసినట్లు ఈమె తెలియజేశారు.స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయిన తర్వాత కథ చెప్పగానే ముందుగా కాస్ట్యూమ్ విషయంపై పరిశోధనలు మొదలు పెట్టామని తెలిపారు.
తాను గర్భవతిగా ఉన్న సమయంలోనే కర్ణాటకలో పలు గ్రామాలను సందర్శించి అక్కడి వారి వస్త్రధారణ చూసిన అనంతరం ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైన్ చేశామని ఈ సందర్భంగా ప్రగతి శెట్టి వెల్లడించారు.