Kajal Pashupati Sandy Master: విడాకులు తీసుకున్న పదేళ్లకు మాజీ భర్తకు సర్ ప్రైజ్ ఇచ్చిన హీరోయిన్.. అభిమానులందరూ షాక్?

తమిళ సెలబ్రిటీ జంట అయినా కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్ నటి కాజల్ పశుపతి ల గురించి మనందరికీ తెలిసిందే.వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట ఆ తర్వాత కొన్ని విభేదాలు కారణంగా 2012లో విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.

 Sandy Master Ex Wife Kaajal Pasupathi Makes Surprise Visit Home, Kajal Pasupathi-TeluguStop.com

ఆ తర్వాత కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్ సిల్వియా అనే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా నటి కాజల్ పశుపతికి సంబంధించిన వార్త ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది.

నటి కాజల్ చేసిన పనికి నెటిజెన్స్ ఆశ్చర్యం పోవడంతో పాటు అవాక్కవుతున్నారు.ఆమె ఎందుకు అలా చేసింది అన్నది అర్థం కాక కొందరు తలలు పట్టుకుంటున్నారు.

అసలేం జరిగిందంటే.తాజాగా కాజల్ శాండీ మాస్టర్ ఇంటికి దాదాపుగా పదేళ్ల తర్వాత వెళ్లడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.ఇటీవలే శాండీ ఇంటికి వెల్లింది కాజల్.అనంతరం శాండీ అతని భార్య సిల్వియా ఇద్దరు పిల్లలతో కలసి సరదాగా మాట్లాడి కాసేపు ముచ్చటించింది కాజల్.

అనంతరం శాండి కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను ఆమె తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.చాలా కాలం తర్వాత వారిద్దరూ కలిసి దిగిన ఫోటోని షేర్ చేయడంతో కాజల్ అభిమానులు క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాకుండా విడాకుల తర్వాత కూడా ఇలా మంచి స్నేహం కొనసాగించడం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఆ ఫోటోలను షేర్ చేసిన కాజల్ శాండీ సిల్వియా వారి పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలి అని రాసుకొచ్చింది.కాగా గతంలో శాండి,సిల్వియా వివాహం పై పెద్ద ఎత్తున విమర్శలు నెగిటివ్ గా కామెంట్స్ వినిపించడంతో వెంటనే కాజల్ విడాకుల విషయంపై శాండి ని నిందించవద్దని అతని రెండో భార్యను కూడా టార్గెట్ చేయవద్దు అని అభిమానులను వేడుకుంది.ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube