సూపర్ స్టార్ కృష్ణ మృతి ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడిని కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే.బయట వారికే ఇలా ఉంటే కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటో చెప్పనక్కర్లేదు.
మహేష్ బాబుతో పాటు ఆయన సోదరీమణులు కృష్ణ మృతి తో కన్నీరు మున్నీరయ్యారు.మహేష్ బాబు ని వందల కొద్దీ ప్రముఖులు పరామర్శించారు.
కోట్లాది మంది అభిమానులు సోషల్ మీడియా ద్వారా సానుభూతి తెలియజేస్తూ మద్దతుగా నిలుస్తున్నారు.ఇక కృష్ణ మృతి నేపథ్యం లో మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ వస్తాడా లేదా అంటూ చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు.
చదువు నిమిత్తం విదేశాల్లో ఉంటున్న గౌతమ్ కృష్ణ ఇటీవల నాయనమ్మ చని పోయిన సందర్భం లో కాస్త ఆలస్యం గా ఇండియాకి తిరిగి వచ్చాడు, కానీ ఈ సారి మాత్రం వెంటనే తాత మృత దేహాన్ని చూసేందుకు ఇండియా కు తిరిగి వచ్చాడు.
నేడు ఉదయాన్నే హైదరాబాద్ లో ల్యాండ్ అయిన గౌతమ్ నేరుగా తాత కృష్ణ మృతదేహాన్ని చూసేందుకు వెళ్లి అక్కడ సందర్శించాడు.గౌతం కృష్ణ చదువు నిమిత్తం విదేశాల్లో ఉంటున్న కారణం గా తాత చివరి చూపుకి నోచుకుంటాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.కానీ ఆయన మృతి విషయం తెలిసిన వెంటనే గౌతమ్ కృష్ణ హైదరాబాద్ కి బయలు దేరాడట.
నేడు ఉదయం హైదరాబాదులో ల్యాండ్ అయిన గౌతం కృష్ణ డైరెక్టుగా తాత మృతదేహం వద్దకు వెళ్లారంటూ కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.తండ్రి కి తండ్రి అయిన కృష్ణ పేరు ను గౌతమ్ తన పేరు చివర్లో పెట్టుకొని తన యొక్క అభిమానం ను చాటుకున్న విషయం తెలిసిందే.
గౌతమ్ కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ యొక్క వారసత్వం ను నిలుపుతాడని అభిమానులంతా కోరుకుంటున్నారు.