Orange Cream : ఆరెంజ్ తో ఇలా చేస్తే చర్మంపై ఎంతటి మొండి మచ్చలైన పరార్ అవుతాయి!

ప్రస్తుత వింటర్ సీజన్‌లో విరి విరిగా లభ్యమయ్యే పండ్ల‌లో ఆరెంజ్ ఒకటి.పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే పండ్లలో కూడా ఆరెంజ్ ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.

 Doing This With Orange Will Reduce Stubborn Spots On The Skin , Stubborn Spots,-TeluguStop.com

ఆరెంజ్ రుచిగా ఉండడమే కాదు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను సైతం అందిస్తుంది.అలాగే చర్మ సౌందర్యానికి కూడా ఆరెంజ్ ఎంతగానో సహాయపడుతుంది.

ముఖ్యంగా ముఖంపై ఉండే మొండి మచ్చలు తరిమి కొట్టడంలో ఆరెంజ్ గ్రేట్‌ గా సహాయపడుతుంది.మరి ఇంతకీ ఆరెంజ్ ను ఎలా వాడితే మొండి మచ్చలు పరార్ అవుతాయి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక ఆరెంజ్ పండును తీసుకుని సగానికి కట్ చేసి అందులో ఉండే జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజ‌లు వేసి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.జెల్లీ స్ట్రక్చర్ లోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అవిసె గింజల జెల్ ను సపరేట్ చేసుకుని చల్లార‌బెట్టుకోవాలి.

పూర్తిగా చల్లారిన అనంత‌రం అందులో ఆరెంజ్ జ్యూస్ మరియు వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్ వేసుకుని ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు బాగా మిక్స్ చేస్తే ఆరెంజ్ క్రీమ్ సిద్ధమవుతుంది.

Telugu Tips, Latest, Orange, Orange Cream, Skin Care, Skin Care Tips, Stubborn S

ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ప్రతిరోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఉన్న మేకప్ ను కంప్లీట్ గా తొలగించి వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న ఆరెంజ్ క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని నిద్రించాలి.

ప్రతిరోజు ఈ క్రీమ్ ను కనుక వాడితే ముఖంపై ఎంతటి మొండి మచ్చలు ఉన్నా సరే క్రమంగా దూరమవుతాయి.అలాగే ఈ ఆరెంజ్ క్రీమ్ ను వాడటం వల్ల స్కిన్ టోన్ మెరుగుపడుతుంది.

మరియు చర్మం కాంతివంతంగా సైతం మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube