షాహి జీరా( Shahi Zeera ).ఇండియన్ స్పైసెస్ లో ఇది ఒకటి.
ముఖ్యంగా బిర్యానీ, పులావ్( Biryani, Pulao ) వంటివి తయారు చేసేటప్పుడు షాహి జీరాను కచ్చితంగా వాడుతుంటారు.అందరికీ జీలకర్ర తెలుసు కానీ.
షాహి జీరా గురించి పెద్దగా ఎవరికీ అవగాహన లేదు.చూడడానికి జీలకర్ర మాదిరిగానే కనిపించిన షాహి జీరా కాస్త ముదురు రంగులో ఉంటుంది.
కారమ్ కార్వీ( Caram Karvy ) అనే మొక్క నుండి షాహి జీరా ను తీస్తారు.దీనిలో ఎన్నో పోషకాలు మరియు ఔషధ గుణాలు నిండి ఉంటాయి.
షాహి జీరా ఆరోగ్యపరంగా అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తున్నారు.అలాంటి వారికి షాహి జీరా సహాయపడుతుంది.ఒక గ్లాస్ వాటర్ లో హాఫ్ టేబుల్ స్పూన్ షాహి జీరా వేసి మరిగించి ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ లో రెండు స్పూన్లు నిమ్మరసం( lemon juice ), ఒక స్పూన్ తేనె కలిపి సేవించాలి.రోజు ఈ డ్రింక్ ను తీసుకుంటే కనుక మెటబాలిజం రేటు పెరుగుతుంది.
దాంతో కేలరీలు కరిగే వేగం పెరిగి త్వరగా బరువు తగ్గుతారు.

షాహి జీరాలో యాంటీ ఆక్సిడెంట్స్ ( Antioxidants )రిచ్ గా ఉంటాయి.దగ్గు, జలుబు వంటి సమస్యలను నివారించగల సామర్థ్యం షాహి జీరాకు ఉంది.షాహి జీరా వేసి మరిగించిన నీటిని తీసుకుంటే జలుబు, దగ్గు వంటి సమస్యలు పరార్ అవుతాయి.
అలాగే షాహి జీరా లో ఉండే పోషకాలు కాలేయ ఆరోగ్యానికి అండగా నిలుస్తాయి.లివర్ సంబంధిత సమస్యల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి.

షాహి జీరా జీర్ణక్రియను సైతం చురుగ్గా మారుస్తుంది.మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను చాలా వేగంగా అరికడుతుంది.షాహీ జీరాను తీసుకోవడం వల్ల మెదడు పనితీరు చురుగ్గా మారుతుంది.ఉదయం పూట షాహ జీరాను తేనెతో కలిపి తింటే అభిజ్ఞా పనితీరు, మానసిక ప్రక్రియ మెరుగుపడుతుంది.
మధుమేహం ఉన్నవారికి కూడా షాహి జీరా ఎంతో మేలు చేస్తుంది.షాహి జీరా వేసి మరిగించిన నీటిని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.