రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 29 వ వర్ధంతి సందర్బంగా సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో టీడీపి, టి,ఎన్,ఎస్,ఎఫ్ నాయకులు మిద్దె ప్రకాష్(6)వసారి ,శ్యాగ ప్రశాంత్ (8) వసారి రక్తదానం చేయడం జరిగింది.ఈ సందర్బంగా టీడీపి వేములవాడ నియోజకవర్గ అడాక్ కమిటీ సభ్యులు, టి,ఎన్,ఎస్,ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షులు మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ సమాజమే దేవాలయం,ప్రజలే దేవుళ్ళు అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది,నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్.
బడుగు బలహీనవర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది,స్త్రీలకు సాధికారతనిచ్చిన గొప్ప మహనీయులు ఎన్టీఆర్ అని అన్నారు.సంక్షేమం,అభివృద్ది, సుపరిపాలనతో అధికారం అంటే పేదల జీవితాలు మార్చేందుకు వచ్చిన అవకాశం అని నిరూపించిన మహనీయులు ఎన్టీఆర్.
ఆశించిన సమసమాజాన్ని సాధించుకుందాం.ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తామని తెలుగుజాతి గొప్పతనాన్ని ప్రపంచానికి కంకణబద్ధులై ఉన్నామని తెలుపుతూ ఆ యుగపురుషునికి వర్థంతి సందర్భంగా నివాళులు మరొకసారి ఘననివాళులు అర్పిస్తూ శ్యాగ ప్రశాంత్,మిద్దె ప్రకాష్ లను అభినందిచారు….