తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేవంత్ స్వీకరించిన దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్ లో ఒక ఈ రకమైన ఉత్సాహం అయితే కనిపిస్తుంది.మొన్నటివరకు తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నా, లేనట్టుగానే పరిస్థితి ఉండేది.
అయితే రేవంత్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది.అధికార పార్టీ టిఆర్ఎస్ పై అదేపనిగా విమర్శలు చేస్తూ, మొన్నటి వరకు టిఆర్ఎస్ కు ప్రధాన ప్రతిపక్షం అన్న స్థాయిలో ఉన్న బీజేపీని పక్కన పెట్టి కాంగ్రెస్ ను ఆ స్థానానికి రేవంత్ తీసుకువచ్చారు.
అంతేకాకుండా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ చేరిపోయిన కొంతమంది ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలో చేర్చుకునే విధానం కు రేవంత్ శ్రీకారం చుట్టారు.ఈ పరిణామాలు అధికార పార్టీ టిఆర్ఎస్ లో ఆందోళన కలిగిస్తున్నాయి.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనేది స్పష్టంగా కనిపిస్తోంది.అయితే రేవంత్ ప్రభావం పై సీనియర్ నాయకులు ఇప్పటికీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
పైకి అంతా ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు గా కనిపిస్తున్న సందర్భం వచ్చినప్పుడల్లా మాత్రం తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు.తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ పార్టీ నేతల కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాణిక్యం ఠాకూర్ ముందు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీని పార్టీ లాగా నడిపించాలని, ఒకరి మైలేజ్ కోసం కాకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పరోక్షంగా రేవంత్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు.
సీనియర్ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లో కొత్త కార్యవర్గం పూర్తిగా విఫలమైందని రేవంత్ ను ఉద్దేశించి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.దీనిపై స్పందించిన మాణిక్యం టాగూర్ ఇకపై అలా జరగకుండా తాను చూస్తానని అందరు పార్టీ ఈ విధానాలను అమలు చేస్తూనే సీనియర్ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడానికి కారణం లేకపోలేదు.

ఇటీవల కొంతమంది నేతలపై రేవంత్ రెడ్డి బహిష్కరణ వేటు వేశారు.వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన వారు ఉన్నారు వారిపై చర్యలు తీసుకోకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా రేవంత్ మాత్రం వారిపై వేటు వేయడంతో ఈ విధమైన అసంతృప్తితో రగిలిపోతూ మాణిక్యం ఠాగూర్ ముందు తన అసంతృప్తిని ఉత్తమ్ వెళ్లగక్కినట్టుగా కనిపిస్తోంది.