ఇటీవల కాలంలో దంపతుల మధ్య గొడవలు వస్తే అవి పెద్ద పెద్ద దారుణాలకే కారణం అవుతున్నాయి.గొడవ జరిగినప్పుడు ఎవరో ఒకరు కాస్త వెనుకకు తగ్గి కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కరించబడే సమస్యలను కూడా పెద్దవిగా చేసుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.
ఓ భర్త తన భార్యతో గొడవ పడి కోపంతో ఆమె ఎడమ చేతి వేళ్లను కొరికి తినేసిన ఘటన కర్ణాటక( Karnataka )లోని బెంగుళూరులో చోటు చేసుకుంది.అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.
వివరాల్లోకెళితే.కర్ణాటకలోని బెంగుళూరు( Bangalore )లో విజయ్ కుమార్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు.విజయ్ కుమార్, పుష్ప అనే యువతిని వివాహం చేసుకున్నాడు.వీరికి ఒక కుమారుడు సంతానం.
వివాహం జరిగి దాదాపుగా 23 ఏళ్లు కావస్తున్న కూడా ఈ దంపతుల మధ్య అన్యోన్యత లేదు.తరచూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేది.
ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉండడంతో విడిపోయి ఎవరికి వారుగా జీవిస్తున్నారు.విజయ్ కుమార్ తన కుమారుడితో కలిసి జీవిస్తుంటే.
పుష్ప ఒంటరిగా జీవిస్తోంది.

అయితే కొంతకాలం తర్వాత మళ్లీ అప్పుడప్పుడు పుష్పతో గొడవకు వెళ్లేవాడు.గత నెల 28న విజయ్ కుమార్( Vijay Kumar ) తన భార్య పుష్ప వద్దకు వెళ్లి తీవ్ర స్థాయిలో గొడవకు దిగాడు.ఇద్దరి మధ్య చాలాసేపు మాటల యుద్ధం నడిచాక, పుష్ప ఎడమ చేతి వేళ్ళు కొరికి నమిలి తినేశాడు.
ఆ తరువాత తన వద్దకు వచ్చి ఉండకపోతే చంపి తినేస్తానని పుష్పను బెదిరించడం మొదలుపెట్టాడు.ఎప్పటికైనా విజయ్ కుమార్ తో తనకు ముప్పు ఉంటుందని భావించిన పుష్ప వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు విజయ్ కుమార్ పై కేసు నమోదు చేసుకుని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







