ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి సీఎం జగన్ నిర్ణయం తీసుకోనున్నారు.ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కానున్నట్లు తెలుస్తోంది.
పది రోజులపాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.ఈ క్రమంలో మంత్రులతో సీఎం జగన్ మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇటీవలే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూ.39.45 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశ పెట్టడం తెలిసిందే.
ఈ తరుణంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలాఖరున లేదా మార్చి మొదటివారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ .విషయంలో ఏ రంగానికి పెద్దగా కేటాయింపులు లేవు అని మేధావులు చెప్పుకు రావడం జరిగింది.కీలకమైన ప్రాజెక్టులకు సంబంధించి కూడా నిధులు కేటాయింపు లేదని ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేయటం జరిగాయి.ఇటువంటి తరుణంలో ఏపీ బడ్జెట్ ఏ విధంగా రూపొందుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.